బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే చట్టపరమైన చర్యలు..
1 min readవన్ టౌన్ సిఐ బోణం ఆదిప్రసాద్
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : ఏలూరు జిల్లా ఎస్పీ డి మేరీ ప్రశాంతి ఐపీఎస్ , ఏలూరు ఇంఛార్జి డిఎస్పీ జి వి యస్. ఫైడేశ్వరరావు యొక్క ఆదేశాలపై ఏలూరు 1 టౌన్ ఇన్స్పెక్టర్ బి. అది ప్రసాద్ వారి యొక్క సిబ్బంది తో కలిసి ఏలూరు 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పంపుల చెరువు పాండురంగ థియేటర్ సెంటర్ మరియు ఇతర ప్రాంతాలలో బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తున్న 18 మందిపై ఏలూరు వన్ టౌన్ ఇన్స్పెక్టర్ కేసులు నమోదు చేసినారు.ఈ సందర్భంగా ఏలూరు వన్ టౌన్ ఇన్స్పెక్టర్ బి ఆది ప్రసాద్ గారు సదరు వ్యక్తులకు కౌన్సిలింగ్ నిర్వహించినారు.జిల్లా ఉన్నతాధికారుల యొక్క ఉత్తర్వులు మేరకు ఏలూరు 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిత్యం డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమాలను నిర్వహిస్తామని ఎవరైనా బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తే వారిపై కేసులు నమోదు చేసి కోర్టు వారి ద్వారా కఠిన శిక్షలకు గురవుతారని కౌన్సిలింగ్ నిర్వహించి ఏలూరు వన్ టౌన్ ఇన్స్పెక్టర్ బి ఆది ప్రసాద్ హెచ్చరించరు.