శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం
1 min readపోలీస్, సాయుధ దళాలతో గ్రామాలలో కవాతు
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ఏలూరు జిల్లా ఎస్పీ డి మేరీ ప్రశాంతి ఐపీఎస్ ఏలూరు డిఎస్పీ ఇ శ్రీనివాసులు యొక్క ఆదేశాలపై ఈ రోజు అనగా శుక్రవారం నాడు నిడమర్రు సీఐ ఎం.సుభాష్ యొక్క అధ్వర్యంలో గణపవరం ఎస్ఐ వి.వేంకటేశ్వర రావు వారి యొక్క సిబ్బంది అర్డవరం పిప్పర మోయ్యేరు మరియు సరిపల్లి గ్రామములలో రానున్నా సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పోలీస్ మరియు సాయుధ దళాల తో నిడమర్రు సి .ఐ నిర్వహించినారు.ఈ కార్యక్రమంలో నిడమర్రు సిఐ మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికలలో ప్రజలు వారి యొక్క ఓటు హక్కును స్వేచ్ఛగా నిర్భయంగా భయ పక్ష పాతాలు లేకుండా వినియోగించుకొనుట కొరకు పోలీస్ వారు అన్ని రకాల చర్యలను తీసుకుంటున్నారు అని ప్రజలకు భరోసా కల్పించినారు.పచ్చని గ్రామాలలో ఏ విధమైన వైశ్యామ్యాలు లేకుండా మీకు నచ్చినటువంటి రాజకీయ పార్టీలకు ఓటు వేసుకునే లాగా ప్రతి ఒక్కరు ఒకరికి ఒకరు సహకరించాలని, ఏ విధమైన సమస్యలను సృష్టించ రాదని,రాజకీయ పార్టీలపై ఉన్న అభిమానంతో ఎదుటి పార్టీల వారిని దూషించ రాదని,ఎన్నికల నేపథ్యంలో ఎదుటివారి యొక్క ఓటును వినియోగించుకునే విషయాలలో ఆటంకాలను సృష్టించ రాదని ఫలానా పార్టీ వారికి ఓటు వేయాలని ప్రలోభాలకు గురి చేయరాదని,గ్రామాలలో ఎవరైనా శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని నిడమర్రు సిఐ హెచ్చరించినారు.