లీగల్ అవేర్ నెస్ క్యాంపు
1 min readపల్లెవెలుగు, వెబ్ కర్నూలు: ఆంధ్రప్రదేశ్ ప్రజా రవాణా విభాగము, కర్నూలు-2 లో ఈ రోజు అనగా 05.11.2022 తేదిన లీగల్ అవేర్ నెస్ క్యాంపు జరిగింది. ఈనాటి సభకు ఆంధ్రప్రదేశ్ ప్రజా రవాణా విభాగము జిల్లా ప్రజా రవాణా అధికారి శ్రీ టేకి వెంకటరామం గారు అధ్యక్షత వహించారు. శ్రీ సి.హెచ్.వెంకట నాగ శ్రీనివాస రావు గారు, సీనియర్ సివిల్ జడ్జి మరియు కర్నూలు జిల్లా అడ్మినిస్ట్రేషన్ సెక్రటరి గారు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్టీసి డ్రైవర్లు ప్రమాదం జరిగినప్పుడు తీసుకోవలసిన న్యాయపరమైన జాగ్రత్తలు, కోర్టు కేసుల్లో ఇరుక్కున్నపుడు వాటిని త్వరితగతిన పరిష్కరించుకోవడంలో గుర్తుంచుకోవలసిన విషయాలు, ఇంకా కార్మికులకు ప్రభుత్వం కల్పిస్తున్న ప్రమాద బీమా సౌకర్యాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ లేబర్ శ్రీ సాంబశివ గారు, ఆర్టీసి స్టాండింగ్ కౌన్సెల్ శ్రీ రాఘవ రెడ్డి గారు, కర్నూలు నాలుగవ పట్టణ సబ్ ఇన్స్పెక్టర్ శ్రీ రమేష్ గారు, కర్నూలు-1 డిపో మేనేజరు శ్రీమతి సుధారాణి గారు, కర్నూలు-2 డిపో మేనేజరు శ్రీ సర్దార్ హుస్సేన్ గారు, డ్రైవర్లు, కండక్టర్లు, గ్యారేజీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.ఇందువెంట చాయా చిత్రాన్ని జతచెయడమైనది.కావున ఈ సమాచారాన్ని మీ పత్రికలో ప్రచురించవలసిందిగా కోరడమైనది.