పోక్సో యాక్ట్ పై న్యాయ విజ్ఞాన సదస్సు
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: గురువారం న్యాయ సేవా అధికార సంస్థ వారు జి. సింగవరం గ్రామం లో గల గవర్నమెంట్ హై స్కూల్ లో పోక్సో యాక్ట్ పై న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అధితిగా శ్రీమతి జి. అపర్ణ ,జ్యూడిషల్ మేజిస్ట్రేట్ అఫ్ ఫస్ట్ క్లాస్ జడ్జి,కర్నూలు హాజరయ్యారు. జడ్జి మాట్లాడుతు అక్కడి పిల్లలకు పోక్సో యాక్ట్ పై అవగాహన కల్పించారు. లైంగిక నేరాల నుండి రక్షణ చట్టం 2012 ప్రకారం పిల్లల పై లైంగిక వేధింపులకు పాల్పడితే కఠిన శిక్షలు కలవని తెలిపారు. 18 సంవత్సరాల లోపు వయస్సు గల పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడకుండా ఈ పోక్సో యాక్ట్ ఉపయోగ పడుతుందని తెలిపారు.ఈ పోక్సో కేసుల ను త్వరిత గతిన పరిష్కరించేoదుకు ప్రత్యేక కోర్ట్ కలదని తెలిపారు. పిల్లలకు ఏదయినా సమస్య వస్తే చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్. 1098 కి కాల్ చేసి చెప్పవచ్చు నని తెలిపారు. ఈ సదస్సు లో ఇంచార్జి హెడ్ మాస్టర్ సుబ్బారాయుడు, టీచర్స్ షర్మిల, ఆదిలక్ష్మి,మృదుల, శ్యామలమ్మ పాల్గొన్నారు.