మహిళా దినోత్సవం సందర్భంగా న్యాయ విజ్ఞాన సదస్సు
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీ బి.లీలా వెంకట శేషాద్రి ఈ శుక్రవారం స్థానిక కట్టమంచి రామలింగారెడ్డి మెమోరియల్ మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాల , ఎస్. ఏ.బి.క్యాంపు,కర్నూలు నందు మహిళా దినోత్సవం సందర్బంగా న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు . జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి శ్రీ బి. లీలా వెంకట శేషాద్రి మాట్లడుతు మహిళల హక్కులు, సాధికారత, సమానత్వం కోసం మహిళలు చేసే పోరాటానికి సాంకేతంగా మార్చి 8 న ప్రపంచ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని తెలిపారు . సాంఘిక, రాజకీయ, సాంసృతిక కార్యక్రమాల్లో స్త్రీ, పురుషులు సమానమని చెప్పడమే ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం అని తెలిపారు. అక్కడి పిల్లలకు పోక్సో యాక్ట్ పై అవగాహన కల్పించారు. పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడితే కఠిన శిక్షలు కలవని తెలిపారు. అనంతరం మహిళా ఉపాధ్యాయులను సన్మానించారు.లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్ ప్రతినిధి లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ లింగ సమానత్వం,మహిళలపై హింస నిర్మూలన , ఆర్థిక సాధికారికత, రాజకీయ భాగస్వామ్యాన్ని కల్పించడం, ఆరోగ్యం మరియు విద్య ను పెంపొందించడం ,సమాజంలో గౌరవించబడడం ,తదితర మహిళల హక్కులను కాపాడడం మనందరి బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమములో అసిస్టెంట్ కమండెంట్ మహబూబ్ బాషా ,పాఠశాల ప్రధానో పాధ్యాయులు వెంకట రెడ్డి, ఎం. సుగుణమ్మ, ఏ. మేరీ సరోజ, బి.లక్ష్మి దేవి, ఆర్. ఎస్. చంద్రకళ దేవి, మంజుల రాణి, నాగలక్ష్మి, కుమార్, అమ్రీన విద్యార్ధి విద్యార్థినీలు తదితరులు పాల్గొన్నారు.