NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కమ్యూనిస్టు పార్టీల అభ్యర్థులను శాసనసభకు పంపండి… పి. రామచంద్రయ్య

1 min read

మార్నింగ్ వాకర్స్ తో మాట్లాడుతున్న సిపిఐ అసెంబ్లీ అభ్యర్థి పి. రామచంద్రయ్య.

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: ఇండియా కూటమి బలపరుస్తున్న కమ్యూనిస్టు పార్టీల అభ్యర్థులను శాసనసభకు పంపాలని  పత్తికొండ నియోజకవర్గం సిపిఐ అసెంబ్లీ అభ్యర్థి పి. రామచంద్రయ్య విజ్ఞప్తి చేశారు. శనివారం సిపిఐ మండల కార్యదర్శి డి. రాజా సాహెబ్, పట్టణ కార్యదర్శి రామాంజనేయులు తో కలిసి ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో మార్నింగ్ వాకర్స్ ను కలుసుకొని వారితో మాట్లాడారు. ఈ సందర్భంగా పి. రామచంద్రయ్య మాట్లాడుతూ, జిల్లాలో అత్యంత వెనుకబడ్డ నియోజకవర్గం పత్తికొండ అని ఈ ప్రాంత అభివృద్ధి కొరకు, పేద ప్రజలు, రైతులు, వ్యవసాయ కూలీలు, మహిళలు ఎదుర్కొంటున్న అనేక సమస్యల పరిష్కారానికై భారత కమ్యూనిస్టు పార్టీ ( సిపిఐ)నేతృత్వంలో అనేక ఉద్యమాలు చేపట్టడం జరిగిందని గుర్తు చేశారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగే ఈ ఎన్నికలలో అధికార వైసిపి, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలు ఉచిత పథకాలతో ప్రజలను ఆకర్షించేందుకు ఎన్నికల హామీలు ఇస్తూ ఓట్లు అడుగుతున్నారని, రెండు పార్టీలను ఇంటికి సాగనంపాలన్నారు. ఇండియా కూటమి బలపరుస్తున్న సిపిఐ అసెంబ్లీ అభ్యర్థి పి. రామచంద్రయ్య కంకి కొడవలి గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి, వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వారు విజ్ఞప్తి చేశారు.

About Author