అహోబిలంలో చిరుత దాడి
1 min read
పల్లెవెలుగువెబ్ : కర్నూలు జిల్లా ఎగువ అహోబిలంలో ఓ భక్తుడి పై చిరుత దాడి చేసింది. పావన నరసింహ స్వామి ఆలయానికి వెళ్లే కాలినడక మార్గంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మెట్ల పై నుంచి దూకి భక్తుడు చిరుత దాడి నుంచి తప్పించుకున్నాడు. గత వారం రోజులుగా ఎగువ అహోబిలంలో చిరుత సంచరిస్తుందని భక్తులు చెబుతున్నారు. కాలినడకన వెళ్లే భక్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటవీ శాఖ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.