ఎమ్మెల్సీ అభ్యర్థి భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి నీ గెలిపించండి
1 min readపల్లెవెలుగు వెబ్ కౌతాళం : మీ అరాచక పాలనకు స్వస్తి పలికే రోజులు దగ్గర పడ్డాయి జగన్… …. శాసనమండలి రద్దు కోసం గవర్నర్కు లేఖ పంపిన జగన్ రెడ్డి కు శాసనమండలి ఓటు అడిగే హక్కు లేదని మంత్రాలయం టిడిపి సీనియర్ నాయకుడు ఉలిగయ్య అన్నారు.. కౌతాళం రాజనగర్, లక్షుమమ్మవ్వ గుడి గ్రామాలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ మేము అధికారంలోకి వచ్చాక ప్రతి జనవరి కి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని మరియు, భోగస్ ఓటరు తయారుచేసి గెలువలని వారంలో సిపిఎస్ రద్దు చేస్తారని దొంగ హామీలు ఇచ్చి, నిరుద్యోగ యువతను నట్టెట్ట ముంచి మాట తప్పి ఇప్పుడు పట్టభద్రుల ఓటు అడగడానికి నీకు కనీసం సిగ్గుందా అని ప్రశ్నించారు… అందుకోసమే చదువుకున్న వ్యక్తులుగా పట్టభద్రులందరూ మరియు ఉపాధ్యాయులు తెలుగుదేశం పార్టీ బలపరిస్తున్న అభ్యర్థి గౌరవనీయులు భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించి శాసనమండలిలో నిరుద్యోగుల సమస్యలపై గళం ఇప్పుతాడు అని మార్పు ఇక్కడినుంచి మొదలవుతుందని అన్నారు. సురేష్ నాయుడు … ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల నాయకులు రామలింగన్నా సిద్దప్ప హాల్వి , నీలకంఠ రెడ్డి, ముకన్న అన్న, మాల రమేష్ , కృష్ణ, అమ్ము వలీ, బోయ తాయన్న, జిల్లా మైనారిటీ కార్యదర్శి రహీమన్, గొట్టయ్య, లక్కే గోవిందు, నభి, నాగరాజు కురువ నాగేష్, లింగెష్, ఋషి తెలుగు యువత నియోజకవర్గ నాయకుడు సతీష్ నాయుడు చూడి రోహిత్,బద్రి ,సురేష్ నాయుడు యువసేన సభ్యులు పెద్ద ఎత్తున తదితరులు పాల్గొన్నారు.