ప్రజా సమస్యలపై అధికారులు దృష్టి పెట్టండి
1 min read– మాపైనే కేసులంటూ కన్నీటి పర్యంతమైన సర్పంచ్ భార్య -ఈరోజు మిడుతూరులో గడపగడప
పల్లెవెలుగు వెబ్ మిడుతూరు : మండల పరిధిలోని పీరు సాహెబ్ పేట గ్రామంలో మంగళవారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12:30 వరకు జరిగిన గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా నందికొట్కూరు ఎమ్మెల్యే తోగూరు ఆర్థర్ పాల్గొన్నారు. గ్రామంలో ఉన్న ప్రతి ఇంటికి వెళ్తూ సంక్షేమ పథకాలు నుంచి వచ్చిన నగదు వివరాల గురించి తెలియజేస్తూ వారికి పత్రాలను అందజేశారు.గడప గడప కార్యక్రమంలో పలు సమస్యల గురించి ఎమ్మెల్యేకు గ్రామ ప్రజలు వివరించారు.గోపు చిట్టెమ్మకు ఇంటి స్థలం మరియు ఇల్లు మంజూరు అయిందని వాటి నగదు వివరాల గురించి ఎమ్మెల్యే లబ్ధిదారురాలికి తెలియజేస్తూ ఉండగా మాకు స్థలమే మంజూరు కాలేదని లబ్ధిదారురాలు ఎమ్మెల్యేకు చెప్పారు.వెంటనే వాలంటీర్లు మరియు అధికారులపై మీరు ఏం చేస్తున్నారంటూ ఎవరెవరికి ఏమేమి పథకాలు వస్తున్నది లేనిది మీకు తెలియదా అంటూ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు.విద్యార్థులు షేక్ షహనాభికి విద్యా దీవెన ఒక సంవత్సరం నగదు రాలేదని,షేక్ షాహిద్,హసీన లకు వసతి దీవెన ఒక్క సంవత్సరం మాత్రమే వచ్చిందని మిగతా రెండు సంవత్సరాలకు గాను మొత్తం ఒక్కొక్కరికి 40 వేల రూపాయలు రాలేదని కానీ పత్రాల్లో మాత్రం నగదు వచ్చినట్లు అధికారులు చూపించారు.ఇండ్ల పక్కనే చెత్తా చెదారం వేస్తూ ఉన్నారని ఇక్కడ మాకు దుర్వాసన రావడం వల్ల మేము జీవించడానికి చాలా కష్టంగా ఉందంటూ కాలనీవాసులు ఎమ్మెల్యేకు తెలుపగా వెంటనే వాటిని తొలగించాలని పంచాయతీ పంచాయతీ కార్యదర్శి వినోద్ ను ఎమ్మెల్యే ఆదేశించారు.గ్రామంలో జలకళ బోర్లు వేయటం లేదని ఎమ్మెల్యేకు గ్రామస్తులు ఫిర్యాదు చేయగా వెంటనే ఉపాధి హామీ పథకం ఏపీడి బాలాజీ నాయక్ తో ఎమ్మెల్యే ఫోన్ చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు.మేము గ్రామ సర్పంచ్ అయి ఉండి కూడా మాపైనే కేసులు ఇదేంటి సార్..?మేము అధికార పార్టీకి చెందిన వారం ఎన్నికల్లో కష్ట పడ్డాం మా మీదే కేసులు పెడితే ఎలా అంటూ గ్రామ సర్పంచ్ పాపిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి భార్య ఉమాదేవి ఎమ్మెల్యే ఎదుట కన్నీటి పర్యంతమయ్యారు. అనంతరం ఎంపీపీ పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి మీరు భోజనాన్ని రుచి చూసిన తర్వాతనే విద్యార్థులకు భోజనం పెట్టాలని ఉపాధ్యాయులకు ఎమ్మెల్యే సూచించారు.అదేవిధంగా సాయంత్రం నాలుగు గంటల నుంచి మిడుతూరు ఎస్సీ కాలనీలో గడపగడప కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కొనసాగించారు.ఈరోజు (బుధవారం)ఉదయం 9 గంటలకు మిడుతూరులో గడప గడప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.ఈకార్యక్రమంలో చెరుకుచెర్ల రఘు kరామయ్య,తలముడిపి వంగాల సిద్ధారెడ్డి,కడుమూరు గోవర్ధన్ రెడ్డి,చౌటుకూరు సర్పంచ్ మదార్ సాహెబ్,ఉస్మాన్ భాష, ఎంపీడీవో జిఎన్ఎస్ రెడ్డి, తహసిల్దార్ సిరాజుద్దీన్,ఏఓ పీ రు నాయక్,ఈఓఆర్డీ ఫక్రుద్దీన్, మండల అధికారులు విశ్వనాథ్,ప్రతాప్ రెడ్డి,జయంతి,సుబ్బయ్య, ఎస్ఐ మారుతి శంకర్,వివిధ గ్రామాల నాయకులు పుల్లయ్య, ఇనాయతుల్ల,మహేష్,కాల రమేష్,సీతారాముడు, పంచాయతీ కార్యదర్శులు సుదీర్,వినోద్,కేశావతి తదితరులు పాల్గొన్నారు.