సమస్యలపై పోరాడే అభ్యర్థులనే గెలిపించండి
1 min readపల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: పశ్చిమ రాయలసీమలో ఎమ్మెల్సీ ఎన్నికలు మార్చి 13వ తేదీ జరగనున్న ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఉపాధ్యాయుల ఆత్మ గౌరవానికి ప్రతీక అని దానికై ఉపాధ్యాయుల అభ్యర్థి కత్తి నరసింహారెడ్డి, పట్టభద్రులు అభ్యర్థి పోతుల నాగరాజు లకు మొదటి ప్రాధాన్యత ఓటువేసి ఉద్యమకారులను ఎమ్మెల్సీలుగా ఎన్నుకోవాలని ఏఐఎస్ ఎఫ్ నంద్యాల జిల్లా అధ్యక్షులు ఎం.శ్రీనివాసులు తెలిపారు. పగిడ్యాల మండల అద్యక్షులు వినోద్ ఆధ్వర్యంలో పగిడ్యాల మండలంలోని కస్తూరిభా పాఠశాల, జడ్పీ పాఠశాల ,మోడల్ ఉన్నత పాఠశాలలో పిడిఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థులు కత్తి నరసింహారెడ్డి పోతుల నాగరాజు ల గెలుపునకై శుక్రవారం ప్రచారాన్ని నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమంలో ఏఐఎస్ ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి మహానంది,తాలూకా అధ్యక్ష కార్యదర్శులు వీరేంద్ర, దినేష్,నాగేంద్ర లు పాల్గొన్నారు. ఈ సంద్భంగా ఆయన మాట్లాడుతూ పశ్చిమ రాయలసీమ ప్రాంతమైన కడప కర్నూల్ అనంతపురం నంద్యాల సత్యసాయి అన్నమయ్య జిల్లాలోని ఉపాధ్యాయ పట్టభద్రుల ఎన్నికలు మార్చి నెల 13వ తేదీ జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలు ఉపాధ్యాయుల పట్టభద్రుల మేధావుల ఆత్మగౌరవానికి ప్రతీక అని ఎన్నికల్లో అవినీతి అక్రమాలు చేసే వ్యాపారస్తులు, ఉపాధ్యాయులు కాని వారు ఎన్నారై ,అభ్యర్థులు రాజకీయ పార్టీల ప్రతినిధులు వీళ్లందరినీ ఓడించే గురుతర బాధ్యత ఉపాధ్యాయుల పైన మేధావులైన పట్టభద్రుల పైన ఉన్నదని గుర్తు చేశారు రానున్న ఎమ్మెల్సీ ఎన్నికలు వామపక్ష భావజాలానికి ,అధికారపక్ష అహంకారానికి మధ్య జరుగుతున్నాయని, తాత్కాలిక తాయిళాలు మరియు శాశ్వత ప్రయోజనాల మధ్య జరుగుతున్నాయన్నారు. సమాజానికి ఏవి అవసరమో మేధావులు పట్టభద్రులు ఉపాధ్యాయులు ఆలోచించి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఉన్నత విద్యావంతులు, ఉపాధ్యాయులు,పట్టభద్రులు గిఫ్ట్ బాక్స్ లకు లొంగరని విజ్ఞతతో ఆలోచన చేసి శాసనమండలిలో పేద ప్రజల పక్షాన సమస్యల పరిష్కారం కోసం విద్యార్థుల సమస్యల పైన పాఠశాల విద్య పరిరక్షణకై కృషి చేసే అభ్యర్థులను ఎన్నుకోవాలని కోరారు. జరుగుతున్న ఎన్నికల్లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి కత్తి నరసింహారెడ్డి, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పోతుల నాగరాజుకి మొదటి ప్రాధాన్యత ఓటువేసి గెలిపించాలని కోరారు.