హరితహారం విజయవంతం చేద్దాం
1 min read– నగర మేయర్ బీవై రామయ్య
పల్లెవెలుగు వెబ్, కల్లూరు: దివంగత నేత డా.వైఎస్ రాజశేఖరరెడ్డి జులై 8 న జయంతి, రైతు దినోత్సవం సందర్భంగా నగర పాలక సంస్థ పరిధిలో 50వేల మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు నగర మేయర్ బీవై రామయ్య. సోమవారం జిల్లా పార్టీ కార్యాయంలో మాజీ ఎంపీ బుట్టారేణుక, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డితో కలిసి పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. నగరాన్ని ఆకు పచ్చని చెట్లతో సుందరికరించేందుకు నగర పాలక సంస్థ ఏర్పాట్లు చేస్తుందని, పార్టీ శ్రేణులంతా స్థానిక కార్పొరేటర్, మున్సిపల్ అధికారులతో కలిసి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఒక్క రోజులో 50వేల మొక్కలు నాటడం రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేదన్నారు.