పార్టీ కోసం పనిచేసే వారికి చేయూతనివ్వండి: సత్యసాయినాథ్ శర్మ
1 min readపల్లెవెలుగు వెబ్: తెలుగు దేశం పార్టీ కోసం నిజాయతీగా పనిచేసే వారికి చేయూత ఇవ్వాలని తెలుగు దేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కాశీ భట్ల సత్య సాయినాథ్ శర్మ తెలుగు దేశం పార్టీ కడప పార్లమెంటు అభ్యర్థి పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డిని కోరారు . ఆయన కార్యాలయంలో సోమవారం నాడు సాయినాథ్ శర్మ శ్రీనివాస రెడ్డి నీ కలసి కడప పార్లమెంటు అభ్యర్థిగా పార్టీ జాతీయ అధ్యక్షుడు నార చంద్రబాబునాయుడు ప్రకటించడంతో ఆయనకు సాయినాథ్ శర్మ పుష్ప గుచ్ఛం ఇచ్చి శాలువ కప్పే సన్మానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం పార్టీ కోసం గత మూడు సంవత్సరాలుగా ఎన్నో కష్టాలను నష్టాలను పోలీస్ కేసులను ఎదుర్కొని పార్టీ కోసం అంకిత భావంతో నిజాయితీగా పనిచేస్తున్న వారికీ తగిన న్యాయం చేయాలని విన్నవించారు కడప పార్లమెంటు అభ్యర్థిగా మీ విజయానికి శాయ శక్తుల పనిచేస్తామన్నారు ఈ సందర్భంగా శ్రీనివాసుల రెడ్డి మాట్లాడుతూ పార్టీ కోసం ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా పనిచేయాలని సూచించారు పార్టీ కోసం పని చేసే వారికి తగిన గుర్తింపు ఉంటుందని ఆన్నారు పార్టీ పటిష్టత కోసం కొన్ని ఇబ్బందులు ఎదురైన పార్టీ శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని పనిచేయాలని కోరారు సాయినాథ్ శర్మ వెంట కడప పార్లమెంట్ మీడియా కోఆర్డినేటర్ జనార్దన్ రావు కాపు సంఘం నాయకుడు శ్రీనివాసులు బిసి సంఘం నాయకుడు మహేష్ తదితరులు ఉన్నారు.