‘బ్యాక్లాగ్ నాన్ డీఎస్సీ’ అర్హుల, అనర్హుల జాబితాపై అభ్యంతరం ఉంటే తెలపండి
1 min read– విభిన్న ప్రతిభావంతుల శాఖ ఏడీ విజయ
పల్లెవెలుగు వెబ్, కర్నూలు : బ్యాక్లాగ్ నాన్ డీఎస్సీ పరిధిలోని ఉద్యోగాలకు సంబంధించి మార్చి 2 నుంచి 31వ తేదీ వరకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులలో అర్హుల, అనర్హుల జాబితాపై అభ్యంతరాలు ఉంటే తెలపాలని విభిన్న ప్రతిభావంతులు, వయో వృద్ధుల సంక్షేమ శాఖ ఏడీ విజయ కోరారు. జాబితాను కార్యాలయం పక్కనే నోటీస్ బోర్డుపై , వెబ్సైట్ www.kurnool.ap.gov.in నందు ఉంచామని గురువారం విడుదల చేసిన ఓ ప్రకటనలో ఆమె పేర్కొన్నారు. అర్హుల, అనర్హుల జాబితాపై అభ్యంతరం ఉంటే ఈ నెల 24వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు కార్యాలయం ఈమెయిల్ ఐడీ [email protected] కు లిఖితపూర్వకంగా పంపాలని తెలిపారు. కోవిడ్ నిబంధనల దృష్ట్యా… మీ అభ్యంతర వినతిపత్రాలను పోస్టు ద్వారా కానీ, కార్యాలయ పనివేళల్లో అందజేయాలని ఏడీ విజయ వెల్లడించారు. గడువు తరువాత వచ్చిన అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోమన్నారు.
డీఎస్సీ పరిధిలోకి రాని ఉద్యోగాలు (17)
జిల్లా వైద్య మరియు ఆరోగ్య కార్యాలయం, కర్నూలు( అంధులు) ల్యాబ్ టెక్నిషియన్‌కు ..
డబ్ల్యూడీఏఎస్సీ–ఎస్ఆర్డీఓబీఎల్ 5(4) 2021– ఎస్డీ( ఎస్డీ)– డబ్ల్యూఏఎస్డకే ఆర్ఎన్ఎల్లో.. ఏడీ, హండ్ల్యూమ్స్ మరియు టెక్టైల్స్, కర్నూలు( అంధులు), జిల్లా పంచాయతీ (బధిరులు), కమిషనరు, కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ (బధిరులు), సూపరింటెండెంట్ ఇంజనీరు, టీజీపీ సర్కిల్ , నంద్యాల ( శారీరక వికలాంగులు) వారు కార్యాలయపు సబార్డినేట్ / అటెండర్ పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చు. అదేవిధంగా కమిషనరు, కర్నూలు ( అంధులు), కమిషనరు, ఆదోని మున్సిపాలిటీ (శారీరక వికలాంగులు) పీ.హెచ్ వర్కర్ పోస్టుకు, కమిషనర్, డోన్ మున్సిపాలిటీ (అంధులు మరియు బధిరులు) పీహెచ్ స్వీపర్ పోస్టుకు, డివిజనల్ ఫారెస్టు కార్యాలయం (డబ్ల్యూ ఎల్) నంద్యాల డివిజన్, డోన్ మున్సిపాలిటీ (అంధులు) ఆఫీస్ వాచర్ పోస్టుకు, జిల్లా విద్యాశాఖ , కర్నూలు( అంధులు) స్వీపర్, కమిషనరు , కర్నూలు మున్సిపాల్ కార్పొరేషన్( అంధులు) పార్కు మాలి, కమిషనరు కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ (అంధులు) మజ్దూరు పోస్టు.