PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విశ్వ గురువుగా ఈ దేశాన్ని పునరుద్ధరిద్దాం

1 min read

పల్లెవెలుగు, వెబ్ కర్నూలు: ప్రపంచానికి ఒక చక్కటి జీవన విధానంతో పాటు గొప్పసంస్కారాన్ని నేర్పిన మన జీవన మూలాలని బ్రతికించుకుంటూ , ఈ దేశాన్ని తిరిగి విశ్వ గురు స్థానంలో నిలబెడదామని, దానికి ముఖ్యంగా వ్యక్తులలో సంస్కరణాభిలాష కలగాలని, అది ఒక ఆధ్యాత్మిక విద్య ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని శ్రీశ్రీశ్రీ సద్గురు పరిపూర్ణతాండవ నాగలింగ శివాచార్య స్వాముల వారి శివజివైక్య మఠాదీషులు శ్రీ శ్రీ సద్గురు యల్లప్ప స్వామి పిలుపునిచ్చారు. గత ఐదు రోజుల నుండి నిర్వహిస్తున్న జ్ఞానయజ్ఞము మరియు అఖండ నామ సంకీర్తనా యజ్ఞంలో భాగంగా వారు భక్తులకు కార్తీక మాసానికి ఉన్న విశిష్టత , భారతీయ సాంస్కృతిక పరంపరను గురించి భక్తులకు చక్కటి దృష్టాంతాలతో వివరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన విశ్వహిందూ పరిషత్తు రాష్ట్ర అధ్యక్షులు గోరంట్ల రమణ మాట్లాడుతూ పూజ స్వామీజీ సమాజాన్ని జాగృతం చేస్తూ, నిస్వార్ధంగా భక్తులకు సేవలు చేస్తున్న ఈ మఠం దినదిన అభివృద్ధి కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గాయత్రీ పరివార్ కర్నూలు ప్రచారకులు డిప్యూటీ తాసిల్దారు రామ కేశవులు, ధార్మికోపన్యాసకులు రఘునాథ రెడ్డి, వైద్యం గిడ్డయ్య సాహితీసేవ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు వైద్యం రామానాయుడు, కామదేను గోశాల వ్యవస్థాపకులు బి .శ్రీరాములు, పెద్ద టేకూరు మాజీ సర్పంచ్ చంద్రకళావతమ్మ, తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్తు ఉమ్మడి కర్నూలు జిల్లా కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
శుక్రవారం కార్తిక లక్షదీపోత్సవం : కార్తిక శుక్రవారం మరియు ఏకాదశి సందర్భంగా సాయంత్రం 6 గంటలకు శ్రీ రుక్మిణి పాండురంగ స్వామి దేవస్థానం నందు లక్షదీపోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు కదలి రాగలరని స్వామీజీ విజ్ఞప్తి చేశారు.

About Author