ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దేందుకు కృషి చేద్దాం
1 min read– సర్పంచు సిద్ధిగారి వెంకటసుబ్బయ్య
పల్లెవెలుగు, వెబ్ చెన్నూరు: గ్రామపంచాయతీని అభివృద్ధి పథంలో నడిపేందుకు మనమందరం కలిసి సమన్వయంతో పని చేద్దామని సర్పంచ్ సిద్దిగారి వెంకటసుబ్బయ్య, కార్యదర్శి రామ సుబ్బారెడ్డిలు తెలిపారు, మంగళవారం స్థానిక గ్రామపంచాయతీ లో సర్పంచ్ అధ్యక్షతన జరిగిన సాధారణ సమావేశానికి, గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లు హాజరయ్యారు, ఈ సందర్భంగా సర్పంచ్, కార్యదర్శులు మాట్లాడుతూ గ్రామ సచివాలయం-1, గ్రామ సచివాలయం-2 లో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 40 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు చేపట్టడం జరిగిందన్నారు, అంతేకాకుండా చెన్నూరు కొత్త రోడ్డు వద్ద నుండి, జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ( మసీదు) వరకు (డి ఎం ఎఫ్ )నిధుల ద్వారా దాదాపు కోటి రూపాయలతో సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులు చేపట్టడం జరుగుతుందన్నారు, దీనికి సంబంధించి ఇప్పటికే టెండర్లు కూడా పూర్తి అయ్యాయని వారు తెలియ చేశారు, అలాగే మైనార్టీ కాలనీ, బెస్త కాలనీ, చెన్నూరు పడమటి వీధి లలో సిమెంట్ రోడ్లు ,డ్రైనేజీ పనులు చేపట్టడం జరిగిందన్నారు, అలాగే శానిటేషన్ పైన ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతుందన్నారు, అనంతరం వార్డు మెంబర్లు సర్పంచ్, కార్యదర్శి దృష్టికి పలు సమస్యలను తీసుకురావడం జరిగింది, ఇంకా డ్రైనేజీ కాలువలు, కరెంటు వంటి పలు సమస్యలను వారి దృష్టికి తీసుకురావడం జరిగింది, కచ్చితంగా ఎక్కడెక్కడ అయితే అసంపూర్తిగా ఉన్న పనులను గుర్తించి వాటిని పూర్తి చేసే విధంగా చర్యలు చేపడతామని వారు తెలియజేశారు,ఈకార్యక్రమంలో వార్డు మెంబర్లు టిఎన్ మహేశ్వర్ రెడ్డి, కృష్ణారెడ్డి, అలాగే పలువురు వార్డు మెంబర్లు పాల్గొన్నారు.