PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బీసీలంతా ఏకమై మన హక్కులను సాధించుకుందాం

1 min read

బీసీల రాజ్యాధికారం కోసం మరో స్వతంత్ర పోరాట రథయాత్ర

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: బీసీలంతా ఏకమై మన హక్కులను సాధించుకుందాం:- వై.నాగేశ్వరరావు యాదవ్ 💐జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్💐జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ వై. నాగేశ్వరరావు యాదవ్ఆధ్వర్యంలో బీసీల కోసం మరో స్వతంత్ర పోరాటం రథయాత్ర ఈరోజు కర్నూలు లో  అంబేద్కర్ భవన్ నుండి బీసీ భవనం వరకు బైక్ ర్యాలీ, రథయాత్ర చేపట్టడం జరిగినది. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి నక్కలమిట్ట శ్రీనివాసులు, రాష్ట్ర అధ్యక్షులు లాకా వెంగళరావుమహిళా అధ్యక్షురాలు నూకాలమ్మ , కర్నూలు జిల్లా అధ్యక్షులు మురళి మనోహర్,ఉపద్యక్షలు మహేశ్వర్రెడ్డి,లక్ష్మణరావు, విజయ గౌరీ యాదవ్  ,కురుమూర్తి ,విజయ్, అయ్యన్న యాదవ్,రఘుగిరిధర్ యాదవ్,విద్యార్థి సంఘం నాయకులు రామకృష్ణ,మోహన్,నాగరాజు,రామ్మోహన్ యాదవ్,నాగేశ్వరరావు యాదవ్,కోదండ రామయ్య యాదవ్,వెంకట రంగయ్య యాదవ్,వెంకటం పల్లి పాపయ్య యాదవ్,మహేష్ యాదవ్,మహేంద్ర,మద్దిలేటి, కౌలుట్లయ్య,రాముడు,కంబగిరి రాముడు,నరేష్, రాంపురం రమేష్,శ్రీనివాసులు,వెంకటా పల్లి,ప్రకాష్, కృష్ణమూర్తి,వెంకట్ రాముడు,రాముడు, సుధాకర్,వెంకటస్వామి, రంగప్ప,సోమేశ్వరయ్య, మనోహర్,రంగారెడ్డి, అనుదీప్ గారు,కుల్లాయప్ప,మాదవరాజు,అక్బర్,స్థానిక బీసీ సంక్షేమ సంఘం నాయకులు ప్రజాసంఘాల నాయకులు,అన్ని కులసంగాలు,యువత,బీసీలు పెద్ద ఎత్తున హాజరై బిర్లా గేట్ సమీపంలో, బీసీ భవనం ఆవరణంలోని మహాత్మ జ్యోతిరావు,పూలే సావిత్రిబాయి పూలే విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగినది.ఈ సమావేశంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు మాట్లాడుతూ:బీసీలకు రాజ్యాధికారంలో తగిన ప్రాధాన్యతను ఇవ్వకపోతే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన బుద్ధి చెబుతాం. జనాభా నిష్పత్తి ప్రకారం మనకు రావాల్సిన వాటాను వచ్చేంతవరకు ఐక్యతతో పోరాడుదాం మన హక్కులను సాధించుకుందాం.బీసీలకు ఎన్నికల ముందు అపద్దకు హామీలను ఇచ్చి గద్దెనెక్కాక బీసీలను ఏ మాత్రం పట్టించుకోని ఈ రాజకీయ పార్టీలకు మన బీసీల బలమేంటో బీసీ జనాభా ఎంతో చూపించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. జనాభాలో సగానికి సగం బీసీలమే ఉన్నాము. జనాభాలో సగం శాతం బీసీలకు ఈ రాజకీయ పార్టీలు ఏమాత్రం గుర్తించడం లేదు. జనాభా నిష్పత్తి ప్రకారం బీసీలకు ఎందుకు రాజకీయ పదవులను కల్పించడం లేదు. బీసీలకు చట్టసభలో 50%రిజర్వేషన్లు కల్పించాలి. బీసీలకు 90 ఎమ్మెల్యే సీట్లు,13 ఎంపీ సీట్లను కేటాయించాలి .మహిళా రిజర్వేషన్లలో బీసీ మహిళలకు సబ్ కోటాను కల్పించాలి.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగివచ్చి బీసీలకు జనాభా నిష్పత్తి ప్రకారం ఎమ్మెల్యే ఎంపీ సీట్లను కేటాయించకపోతే ఉద్యమాలు చేపట్టి సాదించుకుందాం. బీసీలను కేవలం ఓటు బ్యాంకు గా మాత్రమే వినియోగించుకుంటున్న ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన బుద్ధి చెబుదాం. గ్రామాలలో మండలాల్లో నియోజకవర్గాల్లో చైతన్యం రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది వాటి కోసం కూడా మేము సన్నాహాలు చేస్తున్నాం గ్రామాలలో పల్లెనిద్ర లాంటి కార్యక్రమాలను ఏర్పాటు చేసి బీసీలను చైతన్యవంతులను చేసి రాజకీయ అవగాహన కల్పిస్తాం. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు బీసీలకు ఎన్నో హామీలు ఇచ్చిన వాటిలో కూడా ఒకటి కూడా నెరవేర్చలేక పోయింది. బీసీలకు 56 కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాటికి ఒక రూపాయి నిధులు కూడా మంజూరు చేయకుండా కార్పొరేషన్ లోన్ వేరే పరిచారు అదే విధంగా బీసీ భవనాలను ముండి గోడలకే పరిమితం చేశారు బీసీల రిజర్వేషన్ స్థానిక సంస్థల రిజర్వేషన్లలో 34 శాతం ఉన్న రిజర్వేషన్లను 24 శాతానికి తగ్గించి బీసీలను అనేక పదవులకు దూరం చేశారు ఈ ప్రస్తుత ముఖ్యమంత్రి. బీసీలంతా ఏకమవుదాం మన హక్కులను సాధించుకుందాం.

About Author