PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

భ్రూణ హత్యలను సంపూర్ణంగా నివారిద్దాం

1 min read

– ‘లింగ నిర్ధారణ చేసే స్కానింగ్ కేంద్రాలను ఉపేక్షించొద్దు’
– ఆదోని డివిజన్ పరిధిలో 31 స్కానింగ్ కేంద్రాలు

పల్లెవెలుగు, వెబ్ ఆదోని: సమాజంలో లింగ అసమానతలకు కారణమవుతున్న భ్రూణ హత్యలను సంపూర్ణంగా నివారించేందుకు కృషిచేయాలని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ పిలుపునిచ్చారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తూ పీసీ పీఎన్డీటీ చట్టాన్ని ఉల్లంఘిస్తున్న వారిపై కఠినంగా వ్యవహరించాలని సబ్ కలెక్టర్ వైద్యాధికారులను ఆదేశించారు. “శుక్రవారం సబ్ కలెక్టర్ ఛాంబర్ నందు భృణ హత్యలు నివారించడం పీసీ పీఎన్డీటీ చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సమావేశంలో సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ మాట్లాడుతూ తల్లిందండ్రుల ఆలోచనా విధానంలో మార్పులు తీసుకురావడం ద్వారానే భ్రూణ హత్యలను నివారించగలమన్నారు. రానున్న రోజుల్లో గర్భస్థ శిశువులపై లింగ వివక్షకు వ్యతిరేకంగా, పీసీ పీఎన్డీటీ చట్టంపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సమావేశంలో నిర్ణయించారు. లింగ నిర్దారణ చేసే స్కానింగ్ కేంద్రాలపై సమాచారం అందించిన వారికి నగదు బహుమతి అందిస్తామన్నారు. నిబంధనలు ఉల్లంగించిన వారిపై 50 వేలు జరిమాన నుండి 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడుతుందన్నారు. పీసీ పీఎన్డీటీ చట్టం ప్రకారం స్కానింగ్ కేంద్రాలపై ఖచ్చితమైన సమాచారం అందించిన వారికి 25 వేల నుండి లక్ష రూపాయల వరకూ బహుమతి అందించే అవకాశం ఉందన్నారు. ఆదోని డివిజన్ పరిధిలో ఉన్న 31 స్కానింగ్ కేంద్రాలను ప్రతి 3 నెలలకు ఒకసారి తనిఖీ చేసి నూతన రిజిస్ట్రేషన్లు, రెన్యూవల్, సిబ్బంది, చిరునామా, పరికారాల్లో మార్పులు వంటి అంశాలపై తనిఖీ చేసి, నిబంధనలకు విరుద్ధంగా ఉన్నా స్కానింగ్ సెంటర్లను అనుమతులు రద్దు చేస్తామన్నారు.ఈ సమావేశంలో డిప్యూటీ డి.యం.హెచ్.వో డాక్టర్ సత్యవతి, ఏరియా ఆస్పత్రి సూపర్డెట్ డా” లింగన్న, గైనకాలజిస్ట్ డా” సుజాత, డిప్యూటీ మాస్ మీడియా ఆఫీసర్ చంద్రశేఖర్ రెడ్డి, డిస్టిక్ మానిటరింగ్ కన్సల్టెంట్ సుమలత తదితరులు పాల్గొన్నారు.

About Author