ఆత్మహత్యలను..నివారిద్దాం..
1 min readజీవితంపై ఆశ కల్పిద్దాం…
- బిహేవియర్ థెరిపిస్ట్, ఫ్యామిలీ కౌన్సిలర్ మరియు పర్సనాలిటి డెవలప్మెంట్ ట్రైనర్ డాక్టర్ సి. జ్యోతిర్మయి
పల్లెవెలుగు, కర్నూలు: చిన్నా..పెద్ద అనే తేడా లేకుండా…ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, వారి మానసిక స్థితి పసిగట్టి… జీవితంపై ఆశ కల్పించాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందన్నారు బిహేవియర్ థెరిపిస్ట్, ఫ్యామిలీ కౌన్సిలర్ మరియు పర్సనాలిటి డెవలప్మెంట్ ట్రైనర్ డాక్టర్ సి. జ్యోతిర్మయి. ఆదివారం కర్నూలు హార్ట్ ఫౌండేషన్ సెక్రటరి, ప్రముఖ గుండె వైద్య నిపుణులు డా. చంద్రశేఖర్ నేతృత్వంలో ‘ ఆత్మహత్యలు…నివారణ’పై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బిహేవియర్ థెరిపిస్ట్, ఫ్యామిలీ కౌన్సిలర్ మరియు పర్సనాలిటి డెవలప్మెంట్ ట్రైనర్ డాక్టర్ సి. జ్యోతిర్మయ మాట్లాడుతూ ఆత్మహత్యకు పాల్పడాలనుకునే వారు ఎన్ని మార్గాలనైనా ఎంచుకుంటారని,వారి ప్రవర్తన, మానసిక స్థితి సరిగా ఉండదన్నారు. అలాంటి వారిని ముందుగా గుర్తించి… సలహాలు ఇవ్వాలన్నారు. చిన్న చిన్న సూచనల ద్వారా వారికి బతుకుపై ఆశ కల్పించవచ్చన్నారు. ప్రతిఫలం ఆశించకుండా ప్రతిఒక్కరికి సహాయపడాలని, ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పని అప్పగించాలని, లక్ష్యం నిర్దేశించి… ఛేదించాలని సూచిస్తే… ఆత్మహత్యలను కొంత వరకు నివారించినట్లవుతుందన్నారు. మనిషి డిప్రెషన్ లోకి వెళ్లరాదని, ఎప్పుడూ నవ్వుతూ ఆనందంగా పలకరించాలని సూచించారు. కార్యక్రమంలో హార్ట్ ఫౌండేషన్ సభ్యులు కల్కూర చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.