PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రజలను రక్షిస్తూనే… జాగ్రత్తగా ఉందాం..

1 min read

– సమస్యలుంటే తెలపండి.. అండగా ఉంటాం..
– పోలీసు అధికారులకు సూచించిన ఎస్పీ డా. ఫక్కీరప్ప
పల్లెవెలుగు వెబ్​, కర్నూలు : సెకండ్ వేవ్ కరోనా ఉధృతి లో ప్రజలను రక్షిస్తూనే… మనం జాగ్రత్తగా ఉండాలని ఆదేశించారు జిల్లా ఎస్పీ కాగినెల్లి ఫక్కీరప్ప. డిజిపి ఉత్తర్వుల మేరకు డిప్యూటేషన్ లలో విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులతో సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలోని కోవిడ్​ కంట్రోల్​ రూంలో సెకండ్​ వేవ్​పై సమీక్ష నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ కోవిడ్ 19 తీవ్రత రోజు రోజుకి పెరుగుతుండడంతో తీసుకోవలసిన జాగ్రత్తలు, సూచనలను ప్రజేంటేషన్ ద్వారా పోలీసు అధికారులకు వివరించారు. సెకండ్ వెవ్ కరోనా లక్షణాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు, కోవిడ్ వ్యాక్సినేషన్ గురించి, 92 శాతం కంటే ఆక్సిజన్ లెవల్స్ తక్కువగా ఉన్నప్పుడు ఏమి చేయాలి, 92 శాతం కంటే ఆక్సిజన్ లెవల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ఏమి చేయాలి అనే విషయాల గురించి , పల్స్ ఆక్సీ మీటర్ ద్వారా ఏప్పటికప్పడు ఆక్సిజన్ లెవల్స్ గురించి తెలియజేయాలన్నారు. పోలీసు అధికారులకు ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేయించాలన్నారు. ఏమైనా సమస్యలుంటే అందులో తెలియజేయాలన్నారు. వెంటనే సహాయక చర్యలు తీసుకుంటామన్నారు. నోడల్ ఆఫీసర్ లు అప్రమత్తంగా ఉండి కరోనా బారిన పడిన సిబ్బందికి అవసరమైన బెడ్స్, ఆక్సిజన్ వంటి ఏర్పాటు చేయించాలన్నారు. ఈ కార్యక్రమంలో విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారి తిరుమలేశ్వరరెడ్డి, ఇంటెలిజెన్స్ అడిషనల్ ఎస్పీ (ఆర్ ఐ ఓ) రాజశేఖర్ రావు, స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీ మహేశ్వరరెడ్డి, రెడ్ శాండిల్ టాస్క్ ఫోర్స్ డిఎస్పీ రాజీవ్ కుమార్, ఇంటెలిజెన్స్ డిఎస్పీ శ్రీ వెంకట్రాముడు ,ఎసిబి డిఎస్పీ శివనారాయణ స్వామి, సిఐడి డిఎస్పీ రవికుమార్, డిప్యూటేషన్ లలో ఉన్న సిఐలు పాల్గొన్నారు.

About Author