ఎయిడ్స్ మహమ్మారిని తరిమికొడదాం…
1 min readపత్తికొండ జూనియర్ సివిల్ జడ్జి దివ్య
పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: సమాజాన్ని పట్టిపీడిస్తున్న ఎయిడ్స్ మహమ్మారిని తరిమికొడదామని పత్తికొండ జూనియర్ సివిల్ జడ్జి దివ్య పిలుపునిచ్చారు. శుక్రవారం పత్తికొండలో చేపట్టిన ప్రపంచ ఎయిడ్స్ పై అవగాహన ర్యాలీ కార్యక్రమంలో పాల్గొన్న పత్తికొండలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జూనియర్ సివిల్ జడ్జి దివ్య మాట్లాడుతూ, ప్రజలు ఎయిడ్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నారు.మార్క్స్ బ్రిగేడియర్స్ అర్బన్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు, అడ్వకేట్, ఎమ్. అశోక్ కుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, చెడు అలవాట్లు, అపరిచితులతో శృంగారం ఎయిడ్స్ కు దారితీస్తుందని, అలాగే ఒకరు వాడిన బ్లేడ్స్, ఆసుపత్రుల్లో ఒకరు వాడిన సిరంజీలు వాడడం వల్ల కూడా ఎయిడ్స్ రావడానికి అవకాశం ఉందని తెలిపారు.అలాగే అడ్వకేట్ బాలభాష మాట్లాడుతూ ప్రస్తుతం ఎయిడ్స్ కంట్రోల్ కు మందులు వచ్చాయని అన్నారు. మందులు వచ్చాయని చెడుసావాసాలు చేయడం తగదని అన్నారు. ఈ కార్యక్రమంలో అడ్వకేట్ ,నగేష్, అంజి ఆశ వర్కర్లు, విద్యార్థునీలు తదితరులు పాల్గొన్నారు.