వ్యాక్సిన్ వేయించుకున్న కడప నగర మేయర్ సురేష్‌బాబు
కడప నగర మేయర్ సురేష్‌బాబు పల్లెవెలుగు వెబ్, కడప: జిల్లాను కోవిడ్ రహితంగా మారుద్దామని, అందుకు ప్రతిఒక్కరూ సహకరించాలని నగర మేయర్ సురేష్‌బాబు, డిప్యూటీ మేయర్ ముంతాజ్ బేగం పిలుపునిచ్చారు. అర్హులైన వారందరూ కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవాలని, వ్యాక్సిన్‌పై అపోహాలు , భయాందోళనలు పెట్టుకోవద్దని సూచించారు. గురువారం కడప నగర మేయర్ కె. సురేష్ తన నివాసం నందు, డిప్యూటీ మేయర్ ముంతాజ్ బేగం స్థానిక రవీంద్రనగర్ నందు ఏర్పాటు చేసిన వాక్సినేషన్ కేంద్రంలో కోవిడ్ టీకా ను వేయించుకొన్నారు. ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ. జిల్లాలో కోవిడ్ ను పూర్తిగా తరిమి కొట్టడంలో టీకాతోనే సాధ్యమన్నారు. కోవిడ్ వ్యాక్సినేషన్ పై ఇంకా కొంతమందిలో అవగాహన లోపం, భయం, అపోహలు ఉన్నాయని.. ఆ కారణంగా వ్యాక్సిన్ వేయించుకునేందుకు వెనుకాడుతున్నారన్నారు. వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు సంభవించవన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన సమయంలో స్వచ్చందంగా ముందుకు వచ్చి.. నిరభ్యంతరంగా కోవిడ్ వ్యాక్సినేషన్ చేయించుకుని.. జిల్లాను కోవిడ్ రహిత జిల్లాగా మార్చి.. ఆరోగ్యకరమైన సమాజ స్థాపనలో అందరూ భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా ప్రజలకు పిలుపునిచ్చారు.