PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ముచ్చుమర్రి ఎత్తిపోతలను ముట్టడిస్తాం..

1 min read

– రైతులకు పిలుపునిచ్చిన సీపీఐ నాయకులు.

– కేసికి సాగునీరు విడుదల చేయాలి.

– కేసి కెనాల్ రైతుల నోట్లో మట్టి కొడుతున్న పాలకులు.

పల్లెవెలుగు వెబ్  నందికొట్కూరు: కేసి కాలువకు సాగునీరు విడుదల చేయడంలో  అధికారులు, పాలకుల నిర్లక్ష్యం వహించడం తగదని సీపీఐ జిల్లా నాయకులు  ఎం. రమేష్ బాబు అన్నారు. శనివారం నందికొట్కూరు పట్టణంలో  సీపీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ  ఆగస్టు నెల  పూర్తవుతున్నా  అధికారులు స్పందించకుండా నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.  పోతిరెడ్డిపాడు దగ్గర గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల చేసిన  పాలకులకు కేసి కాలువకు సాగునీరు  విడుదల చేయాలనే కనీస అవగాహన కూడా లేదా  అని ప్రశ్నించారు. శ్రీశైలం జలాశయం లో 790 అడుగులు నీటి మట్టం ఉన్నా ముచ్చుమర్రి ఎత్తిపోతల ద్వారా కేసి కాలువకు సాగునీరు అందించవచ్చన్నారు.ప్రస్తుతం 869 అడుగులు నీటి మట్టం ఉందని పాలకులు అధికారుల నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారిందని దుయ్యబట్టారు.   నియోజకవర్గ రైతులు, ప్రజలకంటే  ఇతర జిల్లాల ప్రాంత  అభివృద్దే ముఖ్యమా అని ధ్వజమెత్తారు. శుక్రవారం నాడు  పోతిరెడ్డిపాడు దగ్గర హంగామా చేస్తూ జిల్లాలో ఉన్న వైసీపీ ఏమ్మెల్యే లు ఎంపీలు దిగువ కు  నీరు వదిలారు కానీ  కేసి కెనాల్ రైతుల పరిస్థితి ఆలోచించలేదన్నారు.సకాలంలో  సాగునీరు వదలకుంటే కేసి ఆయకట్టు కింద  సాగుచేసే వరి పండించే  రైతుల పొలాలు బీడు భూములుగా మారుతాయని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వానికి  చేతకాకపొతే క్రాఫ్ హాలీడే ప్రకటించి నష్ట పరిహారం చెల్లించాలని  డిమాండ్ చేశారు. ఇప్పటికే అధికారులు చెప్పిన విధంగా అరతడి పంటలు సాగు చేస్తున్నారు. నీరు లేకపోవడంతో  సాగుచేసిన పంటలు మొలవక పంటను చెడగొట్టిన పరిస్థితి ఉందన్నారు. ఇలాగే నిర్లక్ష్యం చేస్తే ఎమ్మెల్యేల ఇళ్లు ముట్టడిస్తామని, ముచ్చుమర్రి దగ్గర ఆందోళన చేస్తామని  హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో నాయకులు వహిద్దీన్. ,సురేష్, నరసింహ, మక్బుల్  బాషా తదితరులు పాల్గొన్నారు.

About Author