సమిష్టి కృషితో కరోనాకు అడ్డుకట్ట వేద్దాం
1 min read– ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు
పల్లెవెలుగు వెబ్, చిట్వేలి : కోవిడ్ బాధితులకు మెరుగైన వైద్యం అందించి.. త్వరగా కోలుకునేలా చూడాలని ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు వైద్యులకు సూచించారు. శనివారం ప్రభుత్వ ఆసుపత్రి తనిఖీ చేశారు. హాస్పిటల్ వచ్చిన బాధితులను మానవతా దృక్పథంతో వైద్య సేవలు అందించాలని వైద్య అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాసులు మాట్లాడుతూ మరో రెండు రోజుల్లో ప్రభుత్వ ఆస్పత్రిలో 20 ఆక్సిజన్ బెడ్లు, 20 కాన్సంట్రేటర్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రతిఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటించాలని, కరోనా వైరస్ సమష్టి కృషితో తరిమికొడదామని పిలుపునిచ్చారు. ఆయన వెంట నాయకులు వైస్ ఎంపీపీ ధ్వజ రెడ్డి, సుకుమార్ రెడ్డి, రమేష్, మండలం అధికారులు, మండలం నాయకులు తదితరులు ఉన్నారు.