PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కుష్టు వ్యాధి లేని సమాజాన్ని నిర్మిద్దాం..

1 min read

– స్పర్శ్ అవగాహన కార్యక్రమం
పల్లెవెలుగు వెబ్ గడివేముల: జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని జనవరి 30 నుండి ఫిబ్రవరి 13 తేదీ వరకు స్పర్శ్ అవగాహన కార్యక్రమం నిర్వహణలో భాగంగా సోమవారం నాడు మండల కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో మండల ప్రభుత్వ వైద్య అధికారి ముల్లా జబీన్ ఆధ్వర్యంలో . సోమవారం నాడు ఏఎన్ఎంలు ఆశా కార్యకర్తలు మండల వైద్య సిబ్బందితో కుష్టు వ్యాధి నిర్మూలన కోసం ప్రతి ఒక్కరు చేయి చేయి కలుపుదాం అనే నినాదాన్ని వినిపిస్తూ ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా ప్రభుత్వ వైద్య అధికారి జబీన్ మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామ సచివాలయాల్లో సోమవారం నుండి వచ్చేనెల ఫిబ్రవరి 13వ తేదీ వరకు జాతీయ కుష్టువ్యాధి నివారణ వారోత్సవాల్లో భాగంగా వ్యాధి నివారణపై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలన్నారు ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ వేణుగోపాల్ రెడ్డి. ఏఎన్ఎంలు. ఆశ వర్కర్లు. పాల్గొన్నారు.

About Author