వివక్షత లేని సమాజాన్ని నిర్మిద్దాం…
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: కేతవరం గ్రామంలో st జోసఫ్ ఫర్ ఉమెన్ కళాశాల ఎన్ఎస్ఎస్ విద్యార్థులు ప్రత్యేక శిబిరంలో భాగంగా ఆరవ రోజు వివక్ష, దయ గురించి గ్రామ ప్రజలకు తెలియజేశారు .వర్ణ, లింగ బేధం,కులమత వివక్షతను రూపుమాపాలని దానికి యువత ముందుకు రావాలని తెలియజేశారు. ప్రస్తుతం మనం దయా కరుణా లేని యుగంలో జీవిస్తున్నామని ఇతరుల పట్ల దయాగుణం కలిగి ఉండాలని,ప్రేమానురాగాలు అలవర్చుకోలా కోవాలనిఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ చెన్నమ్మ వివరించారు. అనంతరం కేతవరం గ్రామంలోపదివేల సంవత్సరాల క్రితం ఆదిమానవుడు గీసిన చిత్రాలను ఎన్ఎస్ఎస్ విద్యార్థులు సందర్శించారు ఇందులో భాగంగా ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ చిన్నమ్మ మాట్లాడుతూ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పౌల్ సహకారంతో ప్రత్యేక శిబిరం విజయవంతంగా చేస్తున్నాము అని అన్నారు.