వాల్మీకి మహర్షి గుహల లో వాల్మీకి మహర్షి ఉత్సవాలు జరుపుకుందాం
1 min readవైనాగేశ్వరరావు యాదవ్ తెలుగుదేశం పార్టీ బీసీ సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: వాల్మీకి మహర్షి గుహల లో వాల్మీకి మహర్షి ఉత్సవాలు జరుపుకుందాం అభివృద్ధి పరుద్దాం వైనాగేశ్వరరావు యాదవ్ తెలుగుదేశం పార్టీ బీసీ సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులుఈరోజు విజయవాడలోని ఏపీటిడిసి కార్యాలయం నందు టూరిజం ,యువజన,సాంస్కృతిక ,సినిమా ఫోటోగ్రఫీ మాత్యులు శ్రీ కందుల దుర్గేశ్ ని,ఏపీ టూరిజం చైర్మన్ శ్రీ నూకసాని బాలాజీ ని వై నాగేశ్వరరావు యాదవ్ మర్యాదపూర్వకంగా కలిసి వాల్మీకి ఉత్సవాలను జరుపుకోవాలని వినతి పత్రం అందించడం జరిగినది.ఈ సందర్భంగా వై నాగేశ్వరరావు యాదవ్ మాట్లాడుతూ:-నంద్యాల జిల్లా ప్యాపిలి మండలంలో ఉన్న బోయవాండ్ల పల్లి గ్రామ శివారులో సహజ సిద్ధంగా ఏర్పాటు కాబడ్డ వాల్మీకి గుహల నందు వాల్మీకి మహర్షి ఉత్సవాలు నిర్వహించి వాటి యొక్క ప్రాముఖ్యతను దేశ నలుమూలలకు వ్యాపింపజేయాలని కోరుతున్నాము.ముఖ్యంగా పర్యాటకులు చుట్టుప్రక్కల ఉన్న పైరు పొలాలు , కొండ ల అందాలు, పొగమంచు అందాలను వీక్షించడానికి ఆస్వాదించడానికి సరైనా విశ్రాంతి గదులు పర్యాటకులకు ఏర్పాటు చేయాలని కోరుతున్నాము.అలాగే వాల్మీకి గుహల సందర్శనం చేస్తున్న పర్యాటకులకు రెస్టారెంట్ ఉన్న భోజన సదుపాయాలు కల్పించ లేక పోతున్నారు అక్కడి అధికారులు .కావున తమరు మా యొక్క మనవి నీ త్వరితగతిన అమలు చేయాలని కోరడం జరిగింది.