NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

చలో ఢిల్లీని జయప్రదం చేయండి : సిఐటియు

1 min read

పల్లెవెలుగు వెబ్ గోనెగండ్ల: కేంద్రంలోని బిజెపి సర్కారు చేపడుతున్న కార్మిక కర్షక ఉద్యోగ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఏప్రిల్ నెల 5న ఢిల్లీలో నిర్వహించనున్న కార్మికకర్షక ఢిల్లీ పోరాట ప్రదర్శనలో పాల్గొని విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు బి రామాంజనేయులు ఎమ్మిగనూరు తాలూకా నాయకుడు బి రాముడు అన్నారు.మండల కేంద్రమైన గోనెగండ్లలో శనివారం సొసైటీ ఆవరణలోఅన్ని కార్మిక సంఘాలతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులకు కనీస వేతనాలు ఉపాధి భద్రత పిఎఫ్ పెన్షన్ ఆరోగ్య సౌకర్యాలతో కూడిన సమగ్ర చట్టం కలగానే మిగిలిపోతుందని మరోపక్క కార్మికులను యజమానులకు బానిసలుగా చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం చట్టాల్లో మార్పులు చేసి ఇబ్బందులకు గురి చేస్తుందని అన్నారు.వీటన్నిటిని వ్యతిరేకిస్తూ అందరికీ కనీస వేతనం 26000,సిపిఎస్ రద్దు,ఒపిఎస్ పునరుద్ధరణ పంటలన్నింటికీ కనీసం మద్దతుధర గ్రామీణ వ్యవసాయ కార్మికులకు కనీస వేతనం600, 200పని దినాలు కల్పించడం లాంటి డిమాండ్ల సాధనకు వచ్చేనెల 5న ఢిల్లీలో కార్మికకర్షగా పోరాట ప్రదర్శన నిర్వహిస్తున్నామని అన్ని రంగాల కార్మికులందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ నాయకుడు కరుణాకర్ ఏఐకేఎస్ తాలుకా నాయకుడు నరసింహులు వ్యవసాయ కార్మిక సంఘం మండల నాయకుడు దేవేంద్ర వీఆర్ఏ ల సంఘం నాయకులు హనుమంతు దస్తగిరి బడేసా అంగన్వాడి వర్కర్ నాయకురాలు పుష్పావతి ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు కృష్ణ వీరన్న గౌడ్ ఆది పంచాయతీ కార్మికులు మునెప్ప నరసింహులు పాల్గొన్నారు.

About Author