చలో విజయవాడను జయప్రదం చేయండి
1 min readసీమ విద్యార్థి సంఘం పిలుపు
పల్లెవెలుగు, వెబ్ కల్లూరు అర్బన్ : నవంబర్ నెల 16న జరగబోయే చలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని స్థానిక కర్నూలు ఆర్ సి సి కార్యాలయం నందు రైతు కూలీ సంఘం జిల్లా నాయకులు సుంకన్న మరియు సీమ విద్యార్థి సంఘం జిల్లా కార్యదర్శి బాలరాజు కరపత్రాన్ని ఆవిష్కరించారు. తదనంతరం రాయలసీమ అంటేనే రకరకాల ఆలోచనలు మనం మొదలు స్ఫూర్తిస్తాయి ఒకరికి విజయనగర సామ్రాజ్య వేదం గుర్తుకు వస్తే మరొకరికి ఫ్యాక్షన్ గొడవలు గుర్తుకొస్తాయి ఇంకొకరికి ఈ ప్రాంతం నుండి ఉమ్మడి విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అలాగే మన దేశానికి గణీయమైన రాజకీయ నాయకత్వాన్ని అందించిన ప్రాంతంగా గుర్తుకొస్తుంది కొద్దిమంది మానవతావాదులకు మాత్రమే ఇక్కడ ఎన్నో శతాబ్దాల నుండి మర్రి ఊడల్లా పాతికపోయిన కరువు వలస నీటి ద్వారా సంక్రమించిన వెనుకబాటు పతనం గుర్తుకొస్తుంది అక్కడక్కడ అభివృద్ధిని కోరుకునే రాజకీయాలకు అతీతంగా మానవత్వాన్ని రక్షించే సమూహాలు అభివృద్ధి అజెండాలను రూపొందిస్తున్న ఈ ప్రాంతంలోని పెత్తనానికి తోడైన విశేషమైన రాజకీయ అధికారం కలిగిన కొన్ని అభివృద్ధి నిరోధక శక్తులు ఆ ఆలోచనలు అడ్డుకుంటున్నాయి ఒకవైపు తన స్వార్ధ రాజకీయ భవిష్యత్తు కోసం ప్రాంతం యొక్క వెనుకబాటుతనాన్ని ఆసరాగా చేసుకుంటూనే మరొకవైపు వంచించా బడుతున్న రాయలసీమ కరువు పీడిత ప్రజలను జీవ క్షవాలుగా మారుస్తున్నాయి స్వతంత్రం సిద్ధించిన తర్వాత కూడా ఈ పరిస్థితి యధావిధిగా కొనసాగుతూ వస్తుంది రాయల కాలాన్ని స్వర్ణ యుగంగా కీర్తించిన ఆశ్రిత కవి పుంగవులు అదే సామ్రాజ్యంలో దారిద్రం తాండవిస్తున్న పేద ప్రజల పక్షాన కనీసం నాలుగు అక్షరాలను రాయలేకపోయారు రాసుకున్న వాడిదే చరిత్ర అంటే ఇదేనేమో స్వాతంత్ర పోరాటం ఈ ప్రాంతంలో కూడా కొనసాగిందన్న దానికి ఆనవాలుగా 1801 లో జరిగిన తేర్నేకల్ పోరాటం 1846లో జరిగిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పోరాటం ఈ ప్రాంతంలో స్వతంత్ర కాంక్షను బలంగా నాటాయి ఎవరికి వారుగా కాకుండా కలిసి పోరాడి అభివృద్ధి సాధిద్దామని ఆలోచన క్రమక్రమంగా కోస్తా ప్రాంత వాసులకు వచ్చింది ఈ ఆలోచన మరింత బలపడి సంప్రదింపులు రాయబారాల వరకు వచ్చింది 1937లో నవంబర్ 16 న జరిగిన శ్రీ బాగ్ జరిగినా కూడా కోస్తా పెద్దరికం దీన్ని తుంగలో తొక్కడానికి ఏకమయ్యారు అని వాపోయారు అందుకే సీమ విద్యార్థి సంఘం గా ఈ డిమాండ్ మీ ముందు ఉంచుతున్నామని తెలిపారు. రాయలసీమ అభివృద్ధి కోసం తక్షణమే బుందేల్ఖండ్ ప్యాకేజీ అందివ్వాల ప్రత్యేకమైన ఇండస్ట్రియల్ పాలసీ ఎడ్యుకేషన్ పాలసీలను రూపొందించి రాయలసీమలో మైనింగ్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలి తెలిపారు ఈ కార్యక్రమంలో సీమ విద్యార్థి సంఘం టౌన్ కార్యదర్శి దుర్గాప్రసాద్, శివరాజు , కృష్ణ , మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.