NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కాన్షిరాం ఆశయాలను కొనసాగిద్దాం..

1 min read

పల్లెవెలుగు వెబ్​, నందికొట్కూరు: మాన్యశ్రీ కాన్సిరాం  ఆశయాలను ప్రతి ఒక్కరు కొనసాగించాలని  బీఎస్పీ పార్టీ నందికొట్కూరు అసెంబ్లీ ఇన్చార్జి స్వాములు  పిలుపునిచ్చారు.ఆదివారం ఆయన 16వ వర్దంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి బీఎస్పీ నాయకులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాన్సిరాం ఇండియాలోని పంజాబ్లోని లోఫర్ జిల్లాలో మార్చి 15 1934న జన్మించాడన్నారు .మాన్య శ్రీ కాన్సిరాం   సామాజిక న్యాయం కోసం పరితపించి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అడుగుజాడల్లో నడిచి దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో 1984లో బీఎస్పీ పార్టీని స్థాపించి అతికొద్ది కాలంలో అధికారంలోకి తెచ్చినటువంటి ఘనత మాన్యశ్రీ కాన్సిరాం కే దక్కుతుందని అన్నారు. ఆయన అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడిచి బహుజనుల రాజ్యాధికారం కోసం పోరాడాలని వారు పులుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ ప్రజాబంధు పార్టీ రాయలసీమ ఇంచార్జి పల్లె నాగరాజు బీఎస్పీ  తదితరులు పాల్గొన్నారు.

About Author