PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కరోనాను నియంత్రిద్దాం..

1 min read
మాట్లాడుతున్న ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్​ఖాన్​

మాట్లాడుతున్న ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్​ఖాన్​

– ప్రజలకు అవగాహన కల్పిద్దాం..
– అఖిల పక్ష సమావేశంలో ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్​ఖాన్
పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: కరోనాను నివారించేందుకు ప్రతిఒక్కరూ సహకరించాలని, ఇందుకు ప్రజలకు అవగాహన కల్పించి చైతన్యవంతులను చేయాలని ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్​ఖాన్​ అన్నారు. శుక్రవారం రాయల్​ఫంక్షన్​ హాల్​లో అఖిలపక్ష పార్టీల రౌండ్​ టేబుల్​ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కోవిడ్​ ప్రైవేట్​ ఆస్పత్రుల యాజమాన్యం ధనార్జనే ధ్యేయంగా పేదల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదు అందించిందని అలాంటి ఆస్పత్రులపై ఎస్​ఈబీ అధికారులు నిఘా ఉంచారన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన ఫీజుల మాత్రమే వసూలు చేయాలని సూచించారు. ఆక్సిజన్ అవసరమయ్యే పేషెంట్లకు మాత్రమే ప్రభుత్వ ఆసుపత్రికి పంపాలన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ వైద్యశాలలో ఆక్సిజన్ ప్లాంట్ అందుబాటులో ఉందన్నారు. వీటితో పాటు 200కు పైగా వెంటిలేటర్స్ 1500 బెడ్స్ ఉన్నాయని , పేషెంట్స్ అమాంతంగా పెరగటంతో ఒత్తిడికి గురైన డాక్టర్లు , వైద్య సిబ్బంది తో కాస్త ఓపిగ్గా వుంటూ వైద్య సేవలు పొందాలన్నారు. ప్రైవేటు హాస్పిటల్స్ కంటే మెరుగైన వైద్యం ప్రభుత్వ ఆసుపత్రిలోనే దొరికే అవకాశం ఉందన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న జీజీహెచ్​ వైద్యలను అభినందించాలన్నారు. అలాగే ప్రజల సౌకర్యార్థం కూరగాయల మార్కెట్ల వికేంద్రీకరణ , మున్సిపాలిటీ సిబ్బందిని పెంచే యోచన చేస్తామన్నారు.
మెరుగైన వైద్యం అందించేలా చూడండి..
జిల్లాలో హోం ఐసోలేషన్​లో 3600 మంది ఉన్నట్లు సమాచారం అందిందని, వాలంటీర్ల సహకారంతో వివరాలు సేకరించి వారికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని కర్నూలు శాసన సభ్యలు ఎంఏ హఫీజ్​ఖాన్​కు సూచించారు సీపీఎం నేతలు కె. ప్రభాకర్​ రెడ్డి, డి. గౌస్​. అనంతరం సిపిఐ నాయకులు ఎస్ఎన్ రసూల్ మాట్లాడుతూ కరోనా నివారణకై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడం శుభ పరిణామమని తెలిపారు. తప్పులు చేస్తున్న ప్రైవేట్ హాస్పిటల్స్ పై అధికారులు కేసులు పెడుతున్నా , ఇప్పటికీ అనేక ఆసుపత్రులు రోగుల నుండి డబ్బులు దండుకుంటున్నాయని ఆరోపించారు. టిడిపి నాయకులు బి. రామాంజనేయులు మాట్లాడుతూ కరోనా మొదటి దశలో చాలా జాగ్రత్తలు తీసుకోవటం వలన వ్యాధి ప్రబలకుండా చేయగలిగామన్నారు. రెండవ దశలో కరానా వేగవంతంగా ప్రభలుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
కొత్త వైరస్​… అబద్ధం..
బీజేపీ నేత హావిలిన్ బాబు మాట్లాడుతూ కర్నూలు లో కొత్త వైరస్ పుట్టిందని అసత్య ప్రచారంతో ప్రజలు గుండెలు పగిలి చస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేటు ఆసుపత్రులు ప్రజల భయాన్ని సొమ్ము చేసుకుంటున్నాయని తెలిపారు . ప్రభుత్వ ఆసుపత్రిలో చాలా ఘోరమైన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఆయాసంతో వెళ్లే రోగులకు కనీసం ఆక్సిజన్ కూడా అందించడంలో విఫలం అవుతున్నారని ఆరోపించారు. ఎంఐఎం , ఎస్.డి.పీ.ఐ , మజ్లిస్ పార్టీ నేతలు మాట్లాడుతూ ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ ఉన్నా పేషెంట్లకు బెడ్లు ఇవ్వడం లేదని , వేలకు వేలు డబ్బులు చెల్లిస్తేనే బెడ్లు ఇస్తున్నారని ఆరోపించారు . ఈ సమావేశంలో వివిధ పార్టీల నేతలు షబ్బీర్ , పర్వేజ్ , మల్లెపోగు రాజశేఖర్ , హకీం తదితర నేతలతో పాటు కార్పొరేటర్లు కాశి రెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి , శేషు యాదవ్ , షాషావలి, పరమేష్ తదితరులు పాల్గొన్నారు .

About Author