PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నువ్వా నేనా తేల్చుకుందాం..రా..!

1 min read

– మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి ఖబర్దార్.

– టిడిపి రాష్ట్ర ఎస్సీ సెల్ ఆర్గనైజింగ్ కార్యదర్శి గిత్త జయసూర్య.

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు:  నీ చెంచాగాలతో మాండ్ర శివానందరెడ్డినీ, జయ సూర్య పై  మాట్లాడించడం కాదు దమ్ముంటే నువ్వే మాట్లాడు లేదంటే ఖబర్దార్ అని టిడిపి రాష్ట్ర ఎస్సీ సెల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ  గిత్త జయ సూర్య మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి కి సవాల్ విసిరారు. శుక్రవారం నందికొట్కూరు పట్టణంలోని స్థానిక టిడిపి కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోలనుభారతిలో గత ఐదు రోజుల కిందట లబ్బి వెంకటస్వామి టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును, నందికొట్కూరు టిడిపి నాయకులు మాండ్ర శివానందరెడ్డిని విలేకరుల సమావేశంలో విమర్శించడం జరిగిందన్నారు ,దీంతో మేము కూడా మీరు చేసిన అవినీతి అక్రమాలపై మాట్లాడాం. మళ్లీ మూడు రోజుల తర్వాత నీ వద్ద ఉన్న చెంచాగాలతో   అనేక రకమైన పదజాలంతో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాటలు మాట్లాడించడం నీకు తగునా అని మండిపడ్డారు. ఏదైనా ఉంటే ధైర్యంగా ఎదురుగా వచ్చి నువ్వే మాట్లాడొచ్చు కదా అని చురకలు అంటించారు. లబ్బి వెంకటస్వామి చేతకాకపోతే నోరు మూసుకొని  ఉండాలని లేదంటే ఖబర్దార్ నీకు ధీటుగా స్పందిస్తూ నీకు గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. టిడిపి పార్టీలో ఒక దళితుడు ఎదుగుతున్నాడని మొన్న జరిగిన చంద్రబాబు బహిరంగ సభ విజయవంతం  కావడంతో ఓర్వలేక నీ క్రింది స్థాయి మనుషులతో తప్పుడు మాటలు మాట్లాడిస్తే  ఊరుకునే ప్రసక్తి లేదనీ నీవు వైసీపీలో టికెట్ తెచ్చుకో ఎమ్మెల్యేగా పోటీ చేస్తానంటే మాకు అభ్యంతరం లేదు కానీ అనవసరంగా చిల్లర శేష్టాలు చేసిందంటే రాబోయే రోజుల్లో అధికారంలోకి వచ్చేది టిడిపినే  జాగ్రత్త అని జయసూర్య  అన్నారు. నందికొట్కూరు నియోజవర్గంలో 98 జీవో ఉద్యోగాలు ఇప్పించానని చాలా మాట్లాడుతున్నావు వాటిలో నువ్వు చేసిన మోసం త్వరలో ఆధారాలతో సహ భయటపెడతామన్నారు.సమావేశంలో  టిడిపి నాయకులు చిన్న తిరుపాలు, రాష్ట్ర టిడిపి మైనార్టీ అధికార ప్రతినిధి షకీల్ అహ్మద్, రాష్ట్ర లీగల్ సెల్ జాకీర్ హుస్సేన్, నందికొట్కూరు పట్టణ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు నిమ్మకాయల రాజు, పగిడాల మండల కన్వీనర్ పలుచని మహేశ్వర్ రెడ్డి, మహానంది, ప్రభాకర్, లింగస్వామి, గొల్ల నాగ శేషులు, కళాఖర్, మౌలానా అబ్దుల్ సలాం, పగడం శేఖర్, కొణిదెల యువ నాయకుడు బ్రహ్మానంద రెడ్డి, టిడిపి సోషల్ మీడియా భాష, పగిడాల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

About Author