PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆరోగ్యవంతమైన పిల్లల కోసం నులిపురుగులను తరిమేద్దాం

1 min read

– నులి పురుగుల నుండి- పిల్లలను రక్షిద్దాం

– పీహెచ్ సి వైద్య అధికారి డాక్టర్ బి చెన్నారెడ్డి
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు : ఆరోగ్యవంతమైన పిల్లల కోసం నులిపురుగుల తరిమి వేద్దాం, నులి పురుగుల నుండి పిల్లలందరిని రక్షించుకుందాం, ఇందుకోసం1 సంవత్సరం నుండి,19 సంవత్సరాల పిల్లలందరికీ ఆల్బెండజిల్ మింగించడం జరిగిందని పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ బి చెన్నారెడ్డి అన్నారు, మంగళవారం ఆయన మండలంలోని రామనపల్లి, రాచినాయపల్లి ప్రైమరీ పాఠశాలలో జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది, ఇందులో అక్కడి పిల్లలందరికీ నులిపురుగుల నిర్మూలన కొరకు ఆల్బెండ జిల్ మాత్రలను మింగించడం జరిగింది, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ1 సంవత్సరం నుండి19 సంవత్సరాల పిల్లలందరికీ నులుపురుగుల నిర్మూలనకు ఆల్బెండజిల్ మాత్రలను మింగించడం ఎంతో శ్రేయస్కారమని తెలియజేశారు, దీని ద్వారా నులి పురుగుల వల్ల పిల్లలలో రక్తహీనత పెరుగుదల లోపించడం, కడుపునొప్పి వంటి వ్యాధుల నుండి కాపాడవచ్చు నని తెలియజేశారు, అంతేకాకుండా ఇతరత్రా వ్యాధుల నుండి కూడా పిల్లలను కాపాడుకోవచ్చని ఆయన అన్నారు, ముఖ్యంగా గ్రామాలలో ప్రజలు పిల్లల పట్ల, అదేవిధంగా అక్కడి పరిసరాల పట్ల వహించాలని తెలిపారు, ముఖ్యంగా ప్రజలు కొన్ని ముఖ్యమైన ఆరోగ్య సూత్రాలు కచ్చితంగా పాటించాలని సూచించారు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం తో పాటు, పరిశుభ్రమైన నీటిని తాగడం, అదేవిధంగా బయటకు వెళ్ళినప్పుడు బూట్లు, లేదా చెప్పులు ధరించడం మంచిది అన్నారు, అలాగే బహిరంగ ప్రదేశాలలో మలవిసర్జన చేయరాదని, మరుగుదొడ్లను వాడాలని ఆయన తెలియజేశారు, మరుగుదొడ్డికి వెళ్ళినప్పుడు సబ్బుతో చేతులు శుభ్రంగా కడుకోవాలని, కూరగాయలు, పండ్లను నీటితో శుభ్రంగా కడుక్కొని వా డుకోవాలని తెలియజేశారు, చెన్నూరు మండల వ్యాప్తంగా 43 ప్రభుత్వ పాఠశాలలు, 8 ప్రైవేట్ పాఠశాలలు అలాగే 52 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయని, వీటిలో 6 వేల 6 వందల 93 మంది పిల్లలు ఉన్నారని తెలిపారు, వీరి లో మంగళవారం 6, వేల104 మంది పిల్లలకు మాత్రలను మింగించడం జరిగిందన్నారు, మిగిలిన వారికి ఈనెల 18వ తేదీన మింగించడం జరుగుతుందని ఆయన తెలియజేశారు, ఈ కార్యక్రమమునకు గాను అన్ని కేంద్రాలకు 6900 మాత్రలు సప్లై చేయడం జరిగిందని ఆయన తెలిపారు, ఈ కార్యక్రమంలో డాక్టర్ వంశీకృష్ణ, ఎంపీడీవో గంగనపల్లి సురేష్ బాబు, ఎంఈఓ, పాఠశాలల ఉపాధ్యాయులు, అంగన్వాడి టీచర్లు, ఆశ వర్కర్లు, వైద్య సిబ్బంది పాల్గొనడం జరిగింది.

About Author