NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సైకో పాలనను అంతం చేద్దాం..

1 min read

– అందరి ఐక్యతతో ముందుకు  సాగుదాం..

– టిడిపి ఏలూరు నియోజకవర్గ ఇన్చార్జి బడేటి చంటి..

పల్లెవెలుగు వెబ్ ఏలూరు  : ప్రజా సంక్షేమం కోసంపనిచేస్తూ, ప్రభుత్వ తప్పులను ప్రశ్నించిన వారిపై అక్రమ అరెస్టులు, అడ్డగోలు కేసులు పెట్టి వేధిస్తున్న ముఖ్యమంత్రి జగన్ సైకో పాలను అంతం చేద్దామని టిడిపి ఏలూరు నియోజకవర్గ ఇన్చార్జి బడేటి రాధాకృష్ణయ్య (చంటి) పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక 38వ డివిజన్ చేపలతూము కూడలిలో తెదేపా ఇచ్చిన పిలుపుమేరకు సత్యమేవ జయతే పేరుతో నిరాహార దీక్ష చేపట్టారు. గాంధీ జయంతి సందర్భంగా మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రాష్ట్రంలోప్రజాస్వామ్యాన్ని, ప్రజల హక్కుల్ని ముఖ్యమంత్రి జగన్ హరిస్తున్నారని విమర్శించారు.ఏపి అభివృద్ధి అంటే గుర్తుకు వచ్చే వ్యక్తి చంద్రబాబు అన్నారు. యువతకు ఉద్యోగాలు ఉపాధి కల్పించడానికి  చంద్రబాబు ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలుకళ్ల ముందు కనిపిస్తున్నా అసలు స్కిల్ కేంద్రాలేలేవంటూ చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టడంసిగ్గు చేటన్నారు. లోకేష్ సెంటుభూమి కూడా భూసేకరణ చేయని, అసలు రోడ్డు వేయనివేయని అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణంలోఅవినీతి, అక్రమాలు జరిగాయంటూ  కేసులు కేసులు పెట్టడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేయడమే అన్నారు. జగన్ కుఓటమి భయం పట్టుకుందని, రాజకీయంగా ఎదుర్కోలేక చంద్రబాబునుఅరెస్ట్ చేశారన్నారు. న్యాయమే గెలుస్తుందని చంద్రబాబు త్వరలో బయటకు వస్తారని తెలిపారు. వైసిపి కుట్రలకుటీడీపీ కార్యకర్తలు భయపడరని, రెట్టించిన ఉత్సాహంతో పార్టీ గెలుపుకోసం పనిచేస్తారన్నారు. రాష్ట్రంలో ప్రజల హక్కులు కాపాడుతూ ప్రజాస్వామ్యాన్ని బ్రతికించాలంటే రానున్న ఎన్నికలలో ముఖ్యమంత్రి జగన్ సైకో పాలనను తరిమికొట్టాలన్నారు. ఈ దీక్షలలో బడేటి రాధాకృష్ణ మీనా, ఉండవల్లి అనూష ,తేదేపా ఎస్ సి సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జాలా బాలాజీ, టిడిపి మీడియా కో ఆర్డినేటర్ జూట్ మిల్ శ్రీను, బెల్లంకొండ కిషోర్, ఎల్ రవీంద్రబాబు, నాయకులు, తెలుగు మహిళ నాయకులు, కార్యకర్తలు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

About Author