PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

దేశాన్ని సుసంపన్నం చేద్దాం..

1 min read
వీసీలో మాట్లాడుతున్న భారత ప్రధాని నరేంద్రమోదీ

వీసీలో మాట్లాడుతున్న భారత ప్రధాని నరేంద్రమోదీ

– భారత ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు
– ‘క్యాచ్ ద రైన్​’ కార్యక్రమాన్ని వీసి ద్వారా ప్రారంభించిన భారత ప్రధాని
పల్లెవెలుగు వెబ్​, కడప : జలవనరులను సమృద్ధి పరుస్తూ.. ప్రకృతి జల సంపదతో దేశాన్ని సుసంపన్నం చేసే కార్యక్రమంలో అందరూ భాగస్వామ్యం కావాలని భారత ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. సోమవారం ‘ప్రపంచ జల దినోత్సవం‘ సందర్భంగా.. భూగర్భ జల మట్టాన్ని పెంచేందుకు ఈనెల 22వ తేదీ నుంచి నవంబర్ 30, 2021 వరకు ‘ క్యాచ్ ద రైన్​ ’ (వాన నీటిని ఒడిసి పట్టు) అనే నినాదంతో చేపట్టనున్న జలశక్తి అభియాన్ కార్యక్రమాన్ని దేశ రాజధాని ఢిల్లీ నుండి గౌరవ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు.వీసీకి .. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సంబందిత అధికారులు, కడప కలెక్టరేట్ లోని ఎన్.ఐ.సి. వీడియో కాన్ఫరెన్స్ హాలు నుంచి జిల్లా జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) సీఎం సాయికాంత్ వర్మ , సిపిఓ తిప్పేస్వామి తదితరులు పాల్గొన్నారు.
‘ క్యాచ్ ద రైన్ ’ను విజయవంతం చేద్దాం..
ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించిన “క్యాచ్ ద రైన్” (వాన నీటిని ఒడిసి పట్టు) అనే నినాదంతో కూడిన కార్యక్రమాన్ని.. జిల్లాలో ప్రతిష్టాత్మకంగా అమలు చేయాలని జేసీ సాయికాంత్ వర్మ అధికారులను ఆదేశించారు. జిల్లాలో ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో విస్తృత ప్రచారం, అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు.

About Author