PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

థర్డ్ వేవ్ ను సమిష్టిగా ఎదుర్కొందాం

1 min read

– జాయింట్​ కలెక్టర్ (అభివృద్ధి) డాక్టర్ మనజీర్ జీలానీ సామూన్
పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: కరోన వైరస్​ థర్డ్ వేవ్ రానుందని నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో థర్డ్ వేవ్ ను సమిష్టిగా ఎదుర్కొనేందుకు అన్ని రకాల వనరులను సిద్ధం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) డాక్టర్ మనజీర్ జీలానీ సామూన్. సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో కోవిడ్ 19, 18 సంవత్సరాలు పైబడిన వారందరికీ వ్యాక్సినేషన్, థర్డ్ వేవ్ పై జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) డాక్టర్ మనజీర్ జీలానీ సామూన్ సంబంధిత వర్టికల్ నోడల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ కరోనా మూడో దశ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుందని శాస్త్రవేత్తలు, నిపుణులు చెబుతున్నారని అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం వైద్యపరంగా అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. జిల్లాలో వంద పడకల ఆస్పత్రులలో ఆక్సిజన్ ప్లాంట్ నిర్మాణంతో పాటు ఐసియు బెడ్స్, ఆక్సిజన్‌ సిలిండర్లు, ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు, ప్లో మీటర్లు, వెంటిలేటర్ బెడ్స్, తదితర వనరులను ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా ఏర్పాటు చేసుకునేలా చర్యలు చేపట్టాలని డి ఎం హెచ్ ఓ, ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ లను ఆదేశించారు.

18 ఏళ్లు పైబడితేఏ… వ్యాక్సినేషన్​
18 సంవత్సరాలు పైబడిన వారందరికీ వ్యాక్సినేషన్ వేసే ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. అందులో భాగంగా 18 సంవత్సరాలు పైబడినవారు ఎంతమందికి మొదటి డోసు వ్యాక్సిన్ ఇచ్చాము, రెండవ డోసు ఎంత మందికి ఇచ్చాము, ఏ మున్సిపాలిటీ వ్యాక్సినేషన్ పక్రియలో వెనకబడి ఉంది వంటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. కోవిడ్ 19 శ్యాంపుల్ కలెక్ట్, టెస్టింగ్, కాంటాక్ట్ ట్రేసింగ్, హోమ్ ఐసోలేషన్, 104 కాల్ సెంటర్, యాక్టివ్ కేసులు, పాజిటివ్ కేసులు తదితరులు విషయాలపై అధికారులతో జాయింట్ కలెక్టర్ సమీక్షించారు. డీఎంహెచ్ఓ డాక్టర్ రామగిడ్డయ్య, ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ డాక్టర్ సుమన్, డి ఐ ఓ డాక్టర్ విశ్వేశ్వర్ రెడ్డి, డిఆర్డిఎ పిడి వెంకటేశులు, అర్బన్ హెల్త్ సెంటర్ కో ఆర్డినేటర్ డాక్టర్ రేఖ, జిజి హెచ్ సూపర్డెంట్ డాక్టర్ నరేంద్రనాథ్ రెడ్డి, నోడల్ ఆఫీసర్ లు తదితరులు పాల్గొన్నారు.

About Author