PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

క్షయ వ్యాధిపై పోరాడుదాం.. మండల వ్యాప్తంగా అవగాహన ర్యాలీలు

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల: క్షయ వ్యాధి నివారణ వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం నాడు మండల వ్యాప్తంగా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో గ్రామాలలో ప్రజలకు అవగాహన మరియు ర్యాలీలు నిర్వహించారు ఈ సందర్భంగా క్షయ వ్యాధి అంతానికి ప్రతి ఒక్కరు పోరాడుదాం అని గుర్తించిన వెంటనే వ్యాధి నివారణ కోసం ప్రభుత్వ వైద్యశాలల్లో సంప్రదించి సరైన పౌష్టిక ఆహారం మందులు వాడాలని మండల వైద్యాధికారి తేజస్విని తెలిపారు మాట్లాడుతూ క్షయ ( టిబి) సోకిన వ్యక్తి పూర్తి స్థాయి వైద్య పరీక్షలు చేయించుకోని వైద్యులు సూచించిన విధంగా మందులను వాడుకోవడం వల్ల క్షయ వ్యాధిని నివారించవచ్చని ఈ వ్యాధి సోకినప్పుడు మందులతో పాటుగా బలవర్థకమైన ఆహారాన్ని పచ్చి కూరగాయలు, ఆకు కూరలు, ఉడికిన కోడిగుడ్డు ఆహారంగా తీసుకుంటే వ్యాధి బారి నుంచి తొందరగా బ యట పడవచ్చని, గ్రామాలలో వ్యాధి లక్షణాలు, దగ్గు, గొంతులో నజ్జు లాంటివి కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించి సరైన మందులను వాడుకోవడం వల్ల వ్యాధిని నివారించుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో పిహెచ్సి సూపర్వైజర్లు వేణుగోపాల్ రెడ్డి. మహేశ్వర్ రెడ్డి వైద్యశాఖ అధికారులు ఏఎన్ఎంలు వైద్యశాఖ సిబ్బంది అంగన్వాడీలు ఆశ వర్కర్లు పాల్గొన్నారు.

About Author