PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

డోన్ లో టిడిపి పార్టీ జెండాను ఎగరేద్దాం..

1 min read

రాష్ట్ర అభివృద్ధికి అండగా నిలుద్దాం:- వై.నాగేశ్వరరావు యాదవ్ తెలుగుదేశం పార్టీ బీసీ సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్

పల్లెవెలుగు వెబ్ డోన్​:  తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు గ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్  తొలి ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను విడుదల చేయడం జరిగినది దాంట్లో భాగంగా డోన్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా గౌరవనీయులు శ్రీ కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి  పేరు ప్రకటించడంతో ఈరోజు కర్నూలులోని ఆయన స్వగృహం నందు తెలుగుదేశం పార్టీ బీసీ సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ వై నాగేశ్వరరావు యాదవ్ , గండికోట రామ సుబ్బయ్య  తెలుగుదేశం పార్టీ ప్యాపిలి మండలం నాయకులు, మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన నాగేశ్వరరావు యాదవ్  మాట్లాడుతూ:-డోన్ నియోజకవర్గMLAఅభ్యర్థి అయినటువంటి శ్రీ కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి ని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుని శ్రీ నారా చంద్రబాబు నాయుడు కి బహుమతిగా ఇచ్చేందుకు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలు సిద్ధంగా ఉన్నాయి.డోన్ లో తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరేద్దాం. రాష్ట్ర అభివృద్ధికి అండగా నిలుద్దాం.

About Author