PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మహిళల భద్రతపై దృష్టి సారిద్దాం: ఎస్పీ సిద్ధార్థ కౌశల్​

1 min read

పల్లెవెలుగు వెబ్​:కర్నూలు నగరంలోని కర్నూలు మూడవ పోలీసు స్టేషన్ ను జిల్లా ఎస్పీ శ్రీ సిధ్ధార్థ్ కౌశల్ ఐపియస్ గారు మంగళవారం  ఆకస్మిక తనిఖీ చేశారు.  పోలీసు సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకున్నారు.  రిజిస్టర్ లను పరిశీలించారు.  సీజ్ చేసిన వాహనాలను త్వరగా డిస్పోజ్ చేయాలన్నారు.  పోలీసు స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. పోలీసు స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుల పట్ల ఏవిధంగా ప్రవర్తించాలో తెలియజేశారు. పోలీసు స్టేషన్ పరిధిలో ఏ రకమైన నేరాలు ఎక్కువగా  నమోదు అవుతున్నాయో అడిగి తెలుసుకున్నారు.  మహిళలు వారి సమస్యల పట్ల పోలీసుస్టేష న్ ను ఆశ్రయించినప్పుడు  మర్యాదపూర్వకంగా వ్యవహరించాలన్నారు.   ఉమెన్ హెల్ప్ డెస్క్    ఇంకా బాగా  పని చేయాలన్నారు.  ఫిర్యాదులు ఏవిధంగా తీసుకుంటున్నారు.  కేసులు ఏవిధంగా నమోదు చేస్తున్నారానే విషయాన్ని పోలీసు అధికారులను అడిగి తెలుసుకున్నారు. పోలీసులకు తగిన సూచనలు, సలహాలు చేశారు.  ఎస్పీ వెంట కర్నూలు పట్టణ డిఎస్పీ కెవి మహేష్, కర్నూలు  మూడవ పట్టణ పోలీసు స్టేషన్ సిఐ తబ్రేజ్  ఉన్నారు.

About Author