PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాలను నెరవేరుద్దాం

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:   113వ జయంతి  పురస్కరించుకుని జై భీమ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినర్యాలీ లో, కర్నూల్ వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి ఇంతియాజ్, మాజీ శాసన సభ్యులు ఎస్ వి. మోహనరెడ్డి, వైసీపీ నాయకులు అహమ్మద్ అలీఖాన్ లు, పాల్గొని ఆర్ ఎస్, కూడలిలో అయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ఇంతియాజ్ మాట్లాడుతూ, ఉన్నతమైన రాజ్యాంగ వ్యవస్థను నిర్మించడంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ముఖ్య భూమిక పోషించారన్నారు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్  కేవలం దళితుల కోసమే కాకుండా సమాజంలో అణిచివేతకు గురైన అనేక అట్టడుగు వర్గాల శ్రేయస్సు కోసం, మహిళల హక్కులను రాజ్యాంగంలో పొందుపరిచారన్నారు.అంబేద్కర్  ఆలోచన విధానాన్ని ఆశయాలను ప్రతి యువతీ యువకులు ముందుకు తీసుకెళ్లాలని కుల,మత, వర్గ రహిత సమాజాన్ని ఆయన ఆశించారన్నారు ఆయన ఆశయ సాధన కోసం నేను సైతం అంటూ ముందుకు నడవాలన్నారు. ఈ కార్యక్రమంలో ,దళిత, సంఘాల నాయకులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

About Author