చెరో పెట్రోల్ డబ్బా తెచ్చుకుందాం.. తేల్చుకుందాం రా.. !
1 min read
పల్లెవెలుగువెబ్ : గుడివాడలో క్యాసినో నిర్వహించానని నిరూపిస్తే పెట్రోల్ పోసుకుని చస్తా అని ఏపీ మంత్రి కొడాలి నాని సవాల్ విసిరిన నేపథ్యంలో టీడీపీ నేత బొండా ఉమ స్పందించారు. కొడాలి నాని దొరికిపోయి ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని అన్నారు. మంత్రి కొడాలి నాని సవాల్ స్వీకరిస్తున్నామని బోండా ఉమ అన్నారు. క్యాసినో జరిగిందని నిరూపించడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఎప్పడు రావాలో మంత్రి కొడాలి నాని చెప్పాలని అన్నారు. చెరో పెట్రోల్ డబ్బా తెచ్చుకుందాం.. తేల్చుకుందాం అంటూ బోండా ఉమ ప్రతి సవాల్ విసిరారు. క్యాసినోలో డ్యాన్స్ వేసిన వారి పేర్లు తమ వద్ద ఉన్నాయని, విక్టర్, శశిభూషణ్ లాంటి వాళ్లు డ్యాన్స్ వేశారని బోండా ఉమా అన్నారు.