పునీత్ సమాధి వద్ద పెళ్లి చేసుకుంటాం !
1 min readపల్లెవెలుగు వెబ్ :కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమర్ పట్ల అవ్యాజమైన ప్రేమను కన్నడిగులు ప్రదర్శిస్తున్నారు. ఆయన మరణాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. బెంగళూరులోని కంఠీరవ స్టూడియోలోని పునీత్ సమాధిని పెద్దసంఖ్యలో అభిమానులు దర్శించుకొంటున్నారు. బళ్లారికి చెందిన గురురాజ్, గంగా అనే జంట పునీత్‌కు వీరాభిమానులు. రెండేళ్ల నుంచి ప్రేమలో ఉన్న వీరు శనివారం పునీత్ సమాధిని దర్శించుకున్నారు. త్వరలో ఇక్కడే పెళ్లి చేసుకొంటామని తెలిపారు. ఇందుకు శివరాజ్‌కుమార్ కూడా సమ్మతించారని చెప్పారు.