ప్రమిధలు వెలిగిద్దాం-కాలుష్యాన్ని నివారిద్దాం
1 min readపల్లెవెలుగు, వెబ్ చెన్నూరు: కాలుష్యాన్ని నివారిద్దాం, ప్రతి ఒక్కరు తమ ఇంట్లో ప్రమిదలను వాడాలని ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో యం. వి రూరల్ ఫోక్ ఆర్ట్ ఆర్గనైజేషన్ కళాజాత బృందం చే సర్పంచ్ తుంగ చంద్రశేఖర్ యాదవ్ ఆధ్వర్యంలో మండలంలోని కొండ పేట గ్రామంలో ప్రజలకు దీపావళి సందర్భంగా ఏర్పడే కాలుష్య నియంత్రణ పై మంగళవారం అవగాహన కార్యక్రమాన్ని కళాజాత బృందం చేత ఏర్పాటు చేయడం జరిగింది, ఈ సందర్భంగా వారు దీపావళి పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరూ ముఖ్యంగా( గ్రీన్ క్రాకర్స్ )green crackers వాడాలని అలాగే శబ్ద కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ తమ ఇండ్లలో ప్రమిదలు వాడాలని తెలియజేశారు, అంతేకాకుండా కాలుష్యాన్ని అంతా కూడా తరిమి కొట్టాలని వారు పిలుపునిచ్చారు, ఎం.వి రూరల్ ఫోక్ ఆర్ట్ ఆర్గనైజేషన్ కళాజాత బృందం తమ మాటల ద్వారా పాటల ద్వారా అర్థమయ్యే రీతిలో కొండపేట గ్రామ ప్రజలకు చాలా చక్కగా తెలియచేశారు, కాగా ప్రముఖ పర్యావరణ ఇంజనీరింగ్ కేజీ భాష సహాయ పర్యావరణ ఇంజనీరింగ్ సి అనిల్ కుమార్ రెడ్డి, లు మాట్లాడుతూ, ప్రతి ఒక్కరికి పర్యావరణం పై న పైన బాధ్యత ఉండాలని, అతిగా కాలుష్యం ఏర్పడితే మానవ మనుగడకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఎంతైనా ఉందని వారు తెలియజేశారు, కాబట్టి ప్రకృతిని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరు పైన ఉందని వారు తెలియజేశారు, ఈ కార్యక్రమంలో సర్పంచ్ తుంగ చంద్ర శేఖర్ యాదవ్ పంచాయతీ కార్యదర్శి ఎస్ సుబ్రహ్మణ్యం వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సెక్రటరీ కె శ్రీనాథ్ రెడ్డి, కలజాత బృందం మహేష్ , వెంకటేష్, చిరంజీవి , గ్రామ ప్రజలు పాల్గొన్నారు.