జగనన్నను మరోసారి సీఎం చేద్దాం..
1 min readసాయినాథ్ శర్మ అభిమానులు టీడీపీ నుంచి వైసీపీలోకి 50 కుటుంబాలు
- వీఎన్ పల్లె లో వైసీపీ హవా
కమలాపురం, పల్లెవెలుగు: కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం వీరపునాయన పల్లి మండలం మర్రిపల్లి, ఓబులరెడ్డిపల్లి గ్రామాలలో 50 కుటుంబాలు శుక్రవారం తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీ పార్టీలో చేరారు. కమలాపురం నియోజకవర్గ ప్రజా నాయకుడు కాశీభట్ల సత్య సాయినాథ్ శర్మ ఆధ్వర్యంలో ఆయన అభిమానులు తెలుగుదేశం కు రాజీనామా చేసి వైసీపీ పార్టీలో చేరారు. మర్రిపల్లి గ్రామంలో వరికూటి సుధాకర్ రెడ్డి ఆధ్వర్యం లో 20 కుటుంబాలు ఒబులరెడ్డి పల్లె లో నూకనబోయిన శ్రీరామ్ ఆద్వర్యంలో 30 కుటుంబాలు సాయినాథ్ శర్మ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా సాయినాథ్ శర్మ మాట్లాడుతూ కడప ఎంపీగా అవినాష్ రెడ్డిని కమలాపురం శాసనసభ్యుడిగా పోచంరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి రాబోయే ఎన్నికలలో అఖండ మెజారిటీతో గెలిపించడానికి ప్రతి కార్యకర్త చిత్తశుద్ధితో కృషి చేయాలని కోరారు. తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలకు నాయకులకు విలువలేదని కార్యకర్తల సేవలను వాడుకొని కరివేపాకు వలె వదిలేయడం తెలుగుదేశం నాయకులకు వెన్నతో పెట్టిన విద్య అన్నారు. చంద్రబాబు నాయుడు మోసపూరిత మాటలను ప్రజలు నమ్మవద్దని రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించడానికి చంద్రబాబు కుట్రపూరిత కూటమి ఏర్పాటు చేసారన్నారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే ఉజ్వల భవిష్యత్తు ప్రతి కుటుంబానికి ఉంటుందన్నారు. ప్రజా సమస్యల పట్ల ఈ దేశంలో జగన్మోహన్ రెడ్డికి ఉన్నంత శ్రద్ధ మరే ముఖ్యమంత్రికి లేదన్నారు. పేద ప్రజల సంక్షేమం కోసం. పనిచేస్తున్న ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి మనం కలిసికట్టుగా పనిచేసి మరలా ఎన్నికల్లో గెలిపించి మరో 20 ఏళ్ల పాటు రాష్ట్రానికి తిరుగులేని ముఖ్యమంత్రిగా నిలపాల్సిన బాధ్యత మనందరి పై ఉందన్నారు. మండల వైసీపీ కన్వీనర్ రఘునాథ్ రెడ్డి, సంగమేశ్వర స్వామి ఆలయ చైర్మన్ శివ ఆంజనేయులు రెడ్డి, మాజీ సర్పంచ్ సాంబశివరెడ్డి, మిట్టపల్లి మాజీ సర్పంచ్ ప్రతాప్, పాలగిరి శ్రీనివాసులు గోపాల్ రెడ్డి రవి,నారాయణ ,పాలగిరి రాజశేఖర్ రెడ్డి అడవిచేర్లోపల్లి సర్పంచ్ చిన్న నారాయణరెడ్డి యువనాయకుడు కృష్ణారెడ్డి , రామకృష్ణ యాదవ్ రవి యాదవ్ శివ శంకర యాదవ్ , కుమ్ముది ప్రతాపరెడ్డి, భార్గవ్ రెడ్డి లక్ష్మి రెడ్డి, మొయిళ్ళచెరువు శ్రీరామ్ రెడ్డి, సిద్దేశ్వర రెడ్డి రెడ్డి,రఒబులరెడ్డి పల్లె , శ్రీరామ్ రాజమ్మ రవీంద్ర రవి ,శంకర్ బ్రహ్మయ్య ,నాగార్జున లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.