రాష్ట్రంలో జగనన్నని ముఖ్యమంత్రిని చేసుకుందాం
1 min read
2024లో ఆలూరులో గుమ్మనూరు జయరాం అన్నని ఎమ్మెల్యేగా గెలిపించుకుందాం
ఆలూరు మంత్రి క్యాంపు కార్యాలయంకి స్వచ్ఛందంగా తరలివచ్చి సన్నాహాక సమావేశం నిర్వహించిన నియోజకవర్గ పరిధిలోని ప్రజాప్రతినిధులు నాయకులు,కార్యకర్తలు…
పల్లెవెలుగు వెబ్ ఆలూరు : పేదల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కృషి చేస్తున్నారు. నాలుగున్నరేళ్ల వైసీపీ పాలనలో అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చాము. టీడీపీ హయాంలో ఇలాంటి పథకాలు అందాయా? మరోసారి జగన్‌ను సీఎం చేసుకుందామని,వైసీపీని గెలిపించుకుందామని పిలుపునివ్వడం జరిగింది.వైయస్ జగన్ గారు సీఎంగా ఉన్నంత వరకు సంక్షేమ పథకాలు ఆగవు. మంచి చేసే ప్రభుత్వానికి అండగా ఉండాలని మరియు 2024 ఎన్నికల్లో ఆలూరు ఎమ్మెల్యే టిక్కెట్ మంత్రి గుమ్మనూరు జయరామన్నకి ఇవ్వాలని కోరిన ఆలూరు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పిలుపునిచ్చారు.

