కర్నూలును..హరితవనంగా మార్చుదాం..
1 min read– వైఎస్సార్ జయంతిన 50 వేల మొక్కలు నాటుదాం..
– నగర మేయర్ బీవై రామయ్య
పల్లెవెలుగు వెబ్, కర్నూలు: పర్యావరణ పరిరక్షణలో రాష్ట్రంలోనే కర్నూలును ఆదర్శ నగరంగా తీర్చిదిద్దుదామని మేయర్ బీవై రామయ్య పిలుపునిచ్చారు. శనివారం స్థానిక ఔట్ డోర్ స్టేడియంలో నగర కమిషనర్ డీకే బాలాజి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతు బాంధవుడు, దివంగత నేత, మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిన 50వేల మొక్కలు నాటుదామని, అందుకు ప్రతిఒక్కరూ సహకరించాలని కోరారు.
అనంతరం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ… ఖాళీ ప్రదేశాల్లో ఇప్పటికే మొక్కలు నాటడానికి అనువైన ప్రాంతాలను స్థానిక కార్పొరేటర్ ఆధ్వర్యంలో గుంతలను తీయడం శుభపరిణామన్నారు. ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ మాట్లాడుతూ.. జులై 8న జరిగే ఈ మహోన్నత యజ్ఞంలో ప్రతి నగర పౌరుడు పాలుపంచుకోవాలని కోరారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సిద్ధారెడ్డి రేణుక, అదనపు కమిషనర్ పి.వి.రామలింగేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.