PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

హౌసింగ్​ మెగా మేళాను విజయవంతం చేద్దాం..

1 min read

పల్లెవెలుగు వెబ్​, రాయచోటి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలందరికి ఇళ్ళు మెగా మేళా కార్యక్రమం విజయవంతం చేయాలని రాయచోటి మున్సిపల్ కమిషనర్ రాంబాబు పేర్కొన్నారు. ఆదివారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిల్ సబ్యులు మరియు ఇతర శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. జులై 1,3,4 వ తేదీల్లో చేపట్టనున్న హౌసింగ్ మెగామేళా విజయవంతం కొరకు అన్ని వార్డుల కౌన్సిలర్లు, హౌసింగ్ ,ఇంజినీరింగ్ అధికారులు, సచివాలయాల సిబ్బంది తో సమీక్షించారు. అదేవిధంగా ముందస్తు కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేసిన మున్సిపల్ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, మున్సిపల్ కమీషనర్ వార్డుల్లో లబ్దిదారులకు అవగాహన కల్పించి,100%ప్రభుత్వ లక్ష్యం పూర్తి చేస్తామని గౌరవ కౌన్సిల్ సభ్యులు ప్రకటించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ షేక్ ఫయాజ్ బాష,వైస్ ఛైర్మన్ దసరధారామి రెడ్డి, కౌన్సిల్ సభ్యులు, పలువురు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

About Author