శ్రావణమాసం ఉత్సవాలను విజయవంతం చేద్దాం…ఈఓ
1 min read
పల్లెవెలుగు వెబ్ కౌతాళం : మండల పరిధిలో కార్యక్రమం నిర్వహించగా ఉరుకుంద గ్రామంలో శ్రీ లక్ష్మీనరసింహ ఈరన్న స్వామి 2023వ సంవత్సరం శ్రావణమాస ఉత్సవాల సందర్భంగా అన్ని శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్, మరియు అన్ని శాఖల అధికారులు ఎమ్మార్వో డి టి రమేష్ రెడ్డి, ఎంపీడీవో సుబ్బరాజు, ఎంపీపీ అమరేష్, సీఐ ఎరిషావలి, పాలక మండలి అధ్యక్షులు, సభ్యులు, కబ్బేరు ఏంకోబ, ప్రధాన అర్చక వీరప్ప స్వామి, ఎస్సై నరేంద్ర కుమార్ రెడ్డి, శ్రావణమాసం ఈ ఉత్సవాలు విజయవంతంగా జరగడానికి ప్రతి ప్రభుత్వ శాఖ అధికారులు బాధ్యతగా తీసుకొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.