PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

క్విట్ ఇండియా.. సేవ్ ఇండియా నినాదంతో ముందుకెళదాం

1 min read

– క్విట్ ఇండియా ఉద్యమస్ఫూర్తితో కార్పొరేట్ అనుకుల వ్యవస్థ పై పోరాటం…

–  కార్మిక రైతు సంఘాలు పిలుపు

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ:    భారతదేశానికి బ్రిటిష్ పాలకుల నుండి స్వాతంత్రం తెచ్చిపెట్టిన క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో భారతదేశంలో ప్రజానీకంపై  ఆర్థికంగా సామాజికంగా తీవ్ర ప్రభావం చూపుతున్న కార్పొరేట్ రాజకీయాలకు వ్యతిరేకంగా, కార్పొరేట్ వ్యవస్థను కొమ్ముకోస్తున్న ప్రభుత్వాలకు వ్యతిరేకంగా క్విట్ ఇండియా సేవ్ ఇండియా నినాదంతో ముందుకెళదామని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బి వీర శేఖర్, సిఐటియు మండల కార్యదర్శి అశోక్ ,రైతు సంఘం మండల కార్యదర్శి సూరి ,సీనియర్ నాయకులు శ్రీరాములు పిలుపునిచ్చారు. బుధవారం నాడు ఆగస్టు 9 క్విట్ ఇండియా నినాదం ఇచ్చిన రోజును పురస్కరించుకొని దేశవ్యాప్తంగా కార్మిక ,రైతు, వ్యవసాయ కార్మిక సంఘ లు ఇతర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాల్లో భాగంగా అదేవిధంగా, మండల కేంద్రాల నుండి దేశ రాష్ట్రపతికి వినతి పత్రాలు ఇచ్చే కార్యక్రమంలో భాగంగా స్థానిక గాంధీ విగ్రహం ముందు నిరసన తదనంతరం వినతి పత్రం సమర్పించడం జరిగింది.  ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం వచ్చిన తర్వాత శరవేగంగా దేశంలో కార్పొరేట్ అనుకూల విధానాలు ముందుకు వస్తున్నాయని, దీనివలన ప్రజానీకం ఆర్థికంగా సామాజికంగా తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. దేశంలో రైతాంగం పండించిన పంటకు కనీస మద్దతు ధర లేదు,ఢిల్లీలో రైతాంగం ఉద్యమం చేసిన సందర్భంగా ఇచ్చిన హామీల అమలుకు ఇప్పటికీ నోచుకోలేదని, అలాగే దేశంలో కార్పొరేట్ సంస్థలకు చారిత్రాత్మకంగా దేశ ప్రతిష్ట ఇనుముడింప చేసినటువంటి పరిశ్రమలను కారు చౌకగా కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్తున్నారని ఇప్పటికే దేశంలో అన్ని రంగాలు ప్రైవేటికరణ నేపథ్యంలో ప్రైవేటుపరం అయ్యాయని రాబోయే రోజుల్లో మరింత శరవేగంగా చేయడానికి మోడీ ప్రభుత్వం పావులు కదుపుతుందని పేర్కొన్నారు. ఫలితంగా రాష్ట్రంలో ఉన్నటువంటి విశాఖ ఉక్కును మూసివేసే కుట్ర జరుగుతుందని అందుకోసం విశాఖ ఉక్కు  ముడి సరుకు రవాణా ను నిలిపివేశారని తెలిపారు.విమానాలు ,పోర్ట్లు,రోడ్లు విద్యుత్తు ,వైద్యము, ఎల్ఐసి, విమానయానం, రైల్వేలు లాంటి అన్ని రంగాలు  ప్రవేట్ చేతుల్లోకి వెళ్లిపోయాయని మండిపడ్డారు. దేశ ప్రజల కష్టపడి సంపాదించుకున్న సంపదలను మోడీ అప్పనంగా కార్పరేట్లకు అప్పచెప్పుతున్నారని విమర్శించారు. మోడీ ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి వాగ్దానాల్లో విఫలమవడమే కాకుండా, దేశ సంపదను కొల్లగొట్టిన అనేక మంది కార్పొరేట్ సంస్థల యాజమాన్యాలు బ్యాంకులకు నామాలు పెట్టి ,ఇవ్వాల్సిన లోన్లు  ఎగ్గొట్టి విదేశాలకు పరారయ్యారని దీనివలన దేశ ప్రజలపై అనేక విధాలుగా భారాలు పడ్డాయని అన్నారు. నానాటికి పెరుగుతున్నటు నిత్యవసర సరుకులు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలకు అంతులేకుండా పోతుందని సామాన్యుడు బతుకు భారంగా మారుతుందని పేర్కొన్నారు. పరిశ్రమలు లేక ఉపాధి లేక యువత నిరుద్యోగం రోజురోజుకీ దేశంలో పెరిగిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో దేశ సంపదను కాపాడుకోవడానికి క్విట్ ఇండియా నినాదం స్ఫూర్తితో క్విట్ మోడీ  నినాదంతో దేశాన్ని రక్షించుకుందామని వారు పిలుపునిచ్చారు.  కార్మిక, కర్షక, ఇతర సామాజిక రంగాల ,ప్రజా సంఘాల ఐక్యత ద్వారా దేశంలో రాబోయే రోజుల్లో పెద్ద క్యాంపెయిన్ నిర్వహిస్తున్నట్లు వారు ఈ సందర్భంగా చెప్పారు. రైతుల ,కార్మికుల, కూలీల ప్రజల డిమాండ్లను తాసిల్దార్ ద్వారా దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి ఇవ్వవలసిన వినతి పత్రాన్ని తాసిల్దార్ కు ఇవ్వడానికి ప్రయత్నించగా నేను సమావేశంలో ఉన్నాను కుదరదు సమావేశం తర్వాత తీసుకుంటానన్న నేపథ్యంలో వినతి పత్రము ను తాసిల్దార్ కార్యాలయం తలుపులకు ఆతికించారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు ఓంకార్ ,రంగన్న, రాముడు,, సామాజిక ఉద్యమ నాయకులు బంగి రంగన్న రైతు నాయకులు పల్లె దొడ్డి రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

About Author