NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రా కదలి రా.. కార్యక్రమాన్ని జయప్రదం చేయండి

1 min read

పల్లెవెలుగు వెబ్ చెన్నూరు  : కమలాపురం లో జరిగే రా కదలిరా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ కార్యనిర్వహక కార్యదర్శి ఆవుల పవన్ కుమార్ రెడ్డి, మండల ఐ టీ డిపి ఛాంపియన్ యామాల మణికంఠ లు పిలుపునిచ్చారు, గురువారం వారు చెన్నూరులో విలేకరులతో మాట్లాడుతూ, నాలుగున్నర సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచక పాలనపై, వారు చేస్తున్న తో పిడి పై నిగ్గు తేల్చడానికి తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రానున్నారని వారు తెలిపారు, నాలుగున్నర సంవత్సర కాలం లో వైసీపీ ప్రభుత్వం మట్టి దగ్గర నుంచి, ఇసుక, మైనింగ్ దోపిడీ ఇలా అనేక రకాలుగా పంచభూతాలను కూడా వదలకుండా లూటీ చేయడం జరిగిందన్నారు, అలాగే అమలాపురం నియోజకవర్గం లో భూ దందాలు ఎక్కువయ్యాయని వారు మండిపడ్డారు, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కి ఓటు వేసి అత్యధిక మెజార్టీ తో గెలిపించాలని ఈ సందర్భంగా వారు ప్రజలను కోరారు, టిడిపి వస్తే ప్రజా పాలన వస్తుందని, వైసిపి వస్తే మళ్లీ దొరల కబంధహస్తాలలో చిక్కుకొని సామాన్య జనం విలవిలలాడక తప్పదని రామన్న రాజ్యం రావాలంటే చంద్రన్న ముఖ్యమంత్రి కావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని వారు తెలియజేశారు, అదే విధంగా బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ వంటి అనేక పథకాలు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా పథకాలను రూపొందించడం జరిగిందన్నారు, ఇవన్నీ కూడా ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లేందుకు రా కదలిరా కార్యక్రమం ఉంటుందని వారు తెలియజేశారు.

About Author