కార్మిక హక్కుల సాధనకై ఉద్యమిద్దాం
1 min read
ఎస్.మునేప్ప ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి
ఎమ్మిగనూరు, న్యూస్ నేడు: పట్టణంలో కార్మిక హక్కుల సాధన కోసం కార్మికుల ఉద్యమించాలని,కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేకంగా తెచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ఎస్ మునెప్ప తెలిపారు. అనంతరం ఎమ్మిగనూర్ సిపిఐ కార్యాలయం లెనిన్ భవనందు ఏఐటీయూసీ కార్మిక సంఘాల అధ్యక్ష కార్యదర్శుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ఏఐటీయూసీ పట్టణ అధ్యక్షులు నరసింహారెడ్డి అధ్యక్షతన జరిగింది.ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ఎస్ మునెప్ప మాట్లాడుతూ మే డే కు చరిత్రలో ఎంతో ప్రాధన్యత ఉంది,వేలాది మంది అమెరికా కార్మికులు 1886 మే 1న చికాగో నగరంలో హే మార్కెట్ వద్ద పనిగంటలు తగ్గించాలని పని భద్రత కావాలని డిమాండ్ చేస్తు అమెరికా పెట్టుబడి దారి ప్రభుత్వాన్నికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించి, ఆ పోరాటంలో అనేకమంది కార్మికుల ప్రాణ త్యాగాల ద్వారా సాధించుకోవడం జరిగిందని వారు గుర్తు చేశారు. నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక హక్కుల హరిస్తూ పరిపాలన కొనసాగిస్తున్నారని, ముఖ్యంగా విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటుపరం చేయడాన్ని తక్షణమే విరమించాలి, ప్రభుత్వ రంగాల సంస్థ బ్యాంక్ ఎల్ఐసి, బిఎస్ఎన్ఎల్, రైల్వే మార్గం పోస్టల్ డిపార్ట్మెంట్ తదితర ప్రభుత్వ రంగాల్లో సంస్థలను ప్రైవేటుపరం చేయడం ఆపాలి హమలీ ఆటో కార్మికుల ప్రభుత్వ ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి వారికి నెలకు 3000 పింఛన్ ఇవ్వాలి. భవన నిర్మాణం సంక్షేమ చట్టాన్ని పునరుద్దరించాలి ఇసుక ఉచితంగా సరఫరా చేయాలి ప్రభుత్వ రంగాల్లో పనిచేస్తున్న ప్రతి కార్మికునికి ప్రతినెల ఒకటో తేదీ జీతాలు చెల్లించాలి పాత పింఛన్ విధానాన్ని పునరుద్దరించాలి మున్సిపల్ పరిధిలో పనిచేసిన చనిపోయిన కార్మికులు కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలి విద్యుత్ మీటర్ రిడర్స్ కు ఉద్యోగ భద్రత కల్పించాలి కనీస వేతనాలు అమలు చేయాలి ఈ సమావేశంలో ఏఐటీయూసీ తాలూకా అధ్యక్ష కార్యదర్శులు వీరేష్, తిమ్మగురుడు పట్టణ కార్యదర్శి విజేంద్ర, సుంకన్న, శివకృష్ణ, వీరాంజనేయులు, కాజా, వీరేష్,వీరేంద్ర,ఈరన్న, నర్సింలు, రాజా, శేఖర్, ఆనంద్, తదితరులు పాల్గొన్నారు.